– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్
విజయవాడ: ప్రపంచానికి విశ్వగురు భారత్ మాత్రమే నని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నొక్కి వక్కాణించారు. విజయవాడ లో జరిగిన జాతీయ హిందూ ధార్మిక సదస్సులో ముఖ్య అతిథి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశంలో చాలా కాలం విధర్మీయ పాలన జరిగిందని దీనికి కారణం కలికాలం అన్నారు. అయితే సంకల్ప బలం తో విదర్మీయ పాలనకు చరమగీతం పాడి వేదాలు ఆధారంగా పాలన రావాలన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పం తో ప్రపంచం లో భారత దేశం విశ్వగురు స్థానం సాధిస్తుందన్నారు. ఇందుకు ఉదాహరణ విశాఖ లో యోగా దినోత్సవం సందర్భంగా నాలుగు లక్షల మంది ఓంకారం శబ్దం చేసి న విషయం ప్రస్తావించడం గమనార్హం. దేవాలయాలు పై దాడులు చేసిన దుర్మార్గులను అరెస్టు చేయాలన్నారు. సాధుసంతుల ఆశీస్సులు కావాలని మాధవ్ వినమ్ర పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వబిలిశెట్టి వెంకటేశ్వర్లు, సంఘటనా కార్యదర్శి రవి కుమార్, అట్లూరి నారాయణ రావు, గజల్ శ్రీనివాస్, బిజెపి నేతలు నాగోతు రమేష్ నాయుడు, అడ్డూరి శ్రీ రాం, మిట్టావంశీ తదితరులు పాల్గొన్నారు.