Suryaa.co.in

Andhra Pradesh

సింగయ్య పాపం జగన్ రెడ్డికి తప్పక తగులుతుంది…

– తన కారు క్రింద పడి చనిపోయిన సింగయ్య ఇంటికెళ్లి జగన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదు ?
• సింగయ్య ఒక దళితుడనేగా?
• ఏదైనా ఘటన జరిగితే కోటి, రెండు కోట్లు పరిహారం డిమాండ్ చేసే జగన్.. సింగయ్య కుటుంబానికి ఒక నాలుగు కోట్లు ఎందుకు ఇవ్వకూడదు?
• వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి కదా? ఒక 4 కోట్లు ఇచ్చి దళిత కుటుంబాన్ని ఆదుకోవచ్చుకదా?
– విలేఖర్ల సమావేశంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు సూటి ప్రశ్న

మంగళగిరి: జగన్ రెడ్డికి తాను చేసిన పాపాలు వెంటాడుతున్నాయని.. సింగయ్య మృతి కేసుతో పాటు.. మిగిలిన కేసుల్లో కూడా శిక్ష అనుభవించక తప్పదని.. లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

సింగయ్య మృతిపై మానవత్వం లేని మనిషిలా జగన్ రెడ్డి వ్యవహరించారనే అపవాదు రావడంతో సింగయ్య భార్యతో నేర రచయితలు రాయించిన స్క్రీప్ట్ చదివించారు. అసలు ఘటన తెలిసిన వెంటనే రాజకీయాలకు తావులేకుండా ఆసుపత్రికి వెళ్లి సింగయ్య కుటుంబానికి సాయం చేసింది టీడీపీ నాయకుడు కల్లూరి శ్రీను. జగన్ పాలనలో ఎన్నో అత్యాచారాలు హత్యలు జరిగాయి.. చేసిన వారు వైసీపీ వాళ్లు అయితే.. బాధితులను బెదిరించి ప్రెస్ మీట్ లు పెట్టే అలవాటు జగన్ రెడ్డిది.

తన కార్యకర్త తన కారు కింద పడి చనిపోతే జగన్ రెడ్డి వెంటనే ఎందుకు స్పందించలేదు? రక్తపు మడుగుల్లో ఉన్న సింగయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లమని ఎందుకు ఆదేశించలేదు? ఇంత సంఘటన జరిగాక ఒక్క గంటైనా తన కార్యక్రమాన్ని ఎందుకు వాయిదా వేసుకోలేదు? మానవత్వాన్ని ఎందుకు ప్రదర్శించలేదు? మానవత్వం ఉన్న నాయకుడిగా మా యువ నాయకుడు లోకేష్.. చనిపోయింది మీ కార్యకర్త అయినా వెంటనే సింగయ్య కుటుంబాన్ని పరామర్శించాలని ఆదుకోవాలని ఆదేశించారు.

దాన్ని కూడా తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. సింగయ్య భార్య అబద్దాలు మాట్లాడలేక తడబడతా ఉంటే.. పక్కన ఉన్న వైసీపీ మూకలు లోకేష్ మనుషులు వచ్చి బెదరించారని చెప్పాలని స్క్రిప్ట్ చదివిస్తున్నారు. చిన్నదెబ్బలు తగిలినా తన భర్త ఎలా చనిపోయాడో తెలియదు అన్నట్లు ఆమెతో మాట్లాడించారు. వైసీపీ కార్యకర్తలు సింగయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లానన్న తీసుకెళ్లనివ్వలేదని పోలీసులపై నెపం నెట్టే కుట్ర చేస్తున్నారు.

జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో రాష్ట్రం మొత్తానికి తెలుసు. 2019 లో వివేకా హత్య జరిగినప్పుడు రాష్ట్రం ఉలిక్కిపడింది. అది గుండెపోటు కాదని.. గొడ్డలిపోటు, సుత్తెపోట్లని దేశ ప్రజలందరి కంటే ముందు తెలిసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇంత తెలిసిన మనిషి శవం దగ్గరకు వెళ్లి ఏమి తెలియనట్లు ఉన్నాడు? రక్తం పంచిన తండ్రి తమ్ముడు రక్తపు మరకలతో దారుణంగా చంపబడితే.. తన టీవీల్లో ఏమి జరగలేదని తప్పుడు ప్రచారం చేయించాడు.

సీబీఐ, సిట్ చేసిన ఎంక్వైరీ ద్వారా తెలిసిన వాస్తవాల్లో.. వివేకా హత్యలో జగన్ పాత్ర ఉందా అని రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. రాత్రి బాత్ రూమ్ లో చంపడం.. పగలు టీవీల్లో గుండెపోటు అని ప్రచారం చేయడం.. రక్తమరకల్లో ఉన్న బాడి దగ్గరకు వెళ్లి అమాయకంగా చూడటం. జగన్ నటనకు పెద్ద పెద్ద యాక్టర్ లు కూడా సరిపోరు. ఇలాంటి తాను రాజకీయనాయకుడు ఎలా అవుతాడు? ఇంత చేసినోడు సింగయ్య మృతిని పక్కదారి పట్టించలేడా? సింగయ్య భార్యచేత ప్రెస్ మీట్ పెట్టించి స్క్రిప్ట్ చదివించలేడా? సింగయ్యకు యాక్సిడెంట్ జరగలేదు, ఆయనకు చిన్న చిన్నదెబ్బలతో కాలుమీద కాలేసుకుని హాయిగా ఉన్నాడని ఘటన జరిగిన రోజు వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టించారు.

జగన్ కాన్వాయ్ మెడపైకి ఎక్కి.. ప్రాణాపాయస్థితిలో ఉంటే వైసీపీ సోషల్ మీడియాలో తమకు నచ్చినట్లు కామెంట్లు పెట్టారు.. జగన్ రెడ్డి వారం రోజుల క్రితం ఎక్స్‌ లో పోస్ట్ పెట్టారు.. తాను సత్తెనపల్లి వెళ్లి తిరివచ్చేటప్పుడు సింగయ్య తన కారు కింద పడ్డాడని, అది తనవాళ్లు చెబితే తనకు తెలిసిందని.. అందుకు తన వాళ్లను పంపి ఎక్స్ గ్రేషియా ఇవ్వమన్నట్టు అహంకార పూరితంగా ట్విట్ పెట్టారు.

అసలు జగన్ రెడ్డికి మానవత్వం ఉందా? ముళ్ల కంపల్లో సింగయ్యను పడేస్తే.. పోలీసులు బాధ్యతగా తీసుకొని అంబులెన్స్ లో ఆసుపత్రికి పంపారు. సింగయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేడు తన ఇంటికి పిలించుకొని ఉత్తుత్తి ముద్దులు పెడితే సింగయ్య ప్రాణాలకు న్యాయం జరగదు. ఘటనలు జరిగినప్పుడు కోటి, రెండు కోట్లు డిమాండ్ చేసే జగన్ సింగయ్య కుటుంబానికి ఒక నాలుగు కోట్లు ఎందుకు ఇవ్వలేదు? తనకు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి కదా? ఏది ఏమైనా సింగయ్య భార్య మనసులో ఆమె భర్తను చంపింది జగనే అన్న ఆవేదనైతే ఉంది. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు… ఒక ఉగ్రవాద సంస్థ.. సింగయ్య పాపం జగన్ రెడ్డికి తప్పకుండా తగలకుండా పోదు

LEAVE A RESPONSE