– మంత్రి లోకేష్ పర్యవేక్షణ
– సీఎం పిలుపుతో వెల్లువెత్తిన విరాళాలు
విజయవాడ: విజయవాడ, పరిసర ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంత్రి లోకేష్ వీటిని పర్యవేక్షిస్తున్నారు.
• వరద సహాయ చర్యల్లో భాగంగా మెరుగైన సేవల కోసం ప్రతీ వార్డుకు ఒక శాసనసభ్యుడికి బాధ్యతలు.
• ఇప్పటికే వార్డులు వారీగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు.
• రాష్ట్రవ్యాప్తంగా దాతల నుంచి విరాళాలు, మంత్రి లోకేష్ కు చెక్కులు అందజేత.
• మంగళగిరి నియోజకవర్గంకు చెందిన కళ్లం రాజశేఖర్ రెడ్డి రూ.10 లక్షలు, కొమ్మారెడ్డి కిరణ్ రూ.10 లక్షలు విరాళం.
• వీరితో పాటు ఏవీ రమణారెడ్డి రూ. 7 లక్షలు, ఒంగోలుకు చెందిన మేదరమెట్ల సుబ్బయ్య రూ. లక్ష, ఆలూరు కొండలరావ్ రూ.50 వేలు, ఆలూరి ఝాన్సీలక్ష్మీ రూ.50 వేలు చొప్పున విరాళం అందజేత.
• వాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీ, న్యూ రాజీవ్ నగర్ ప్రాంతాల్లో ఉదయం నుంచి హెలీకాప్టర్ల ద్వారా 42 వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు, పండ్లు జారవేత.
• వరద సహాయ చర్యలపై మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ లతో లోకేష్ సమన్వయం.
• కృష్ణా నదిలో తగ్గుముఖం పట్టిన వరద. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 7,91,311 క్యూసెక్కుల వరద ప్రవాహం.