జాతీయ పార్టీనా? జగన్ పార్టీనా?

– జాతీయ పార్టీనా? జగన్ పార్టీనా?

ఎన్నికల నోటిఫికేషన్‌ తదుపరి ప్రతి క్షణము విలువైందే మనకు. కానీ ఈ సూత్రం బీజేపీకి వర్తించదు . తన దత్త పుత్రుడికి యే మేర సాయం అందించాలన్నదే వారి ఉద్దేశం. ప్రస్తుతం నిజమే. అందరిలోనూ ఉక్రోషం ..ఆగ్రహం కలిగిస్తోంది.

మేము తోపులం…పిడి బాకులం. మాకు ఎవరూ సాటిలేరు. మాది జాతీయ పార్టీ. ముమ్మాటికి కానే కాదు. మీది జగన్ని పెంచుకున్న పార్టీ .

16 స్థానాల ఎంపిక కు ఇంత బిల్డప్ అవసరమా?
కొండను తవ్వి ఎలుకలు పట్టడానికి తీసుకున్న జాప్యం నేస్తానికి బాగా ఉపయోగ పడ్డది.ఇదంతా నటనే! నిజమే ? మిత్రుడుకి ఇంత పరోక్ష సాయమా?

స్వయంగా మీరే మీ బాగోతం అంతా తేట తెల్లం చేసుకున్నారు .ఏ గొర్రెను బలి పశువును చేస్తే జగన్ కు మేలు జరుగుతుందో ఆలోచించి మరీ తయారైన లిస్ట్ ఇది.

విలువైన కాలం అంతా గాలికి వదిలి.. ఇప్పుడు 16 స్థానాలు బహుమతిగా ప్రకటించిన మీరు, జాతీయ నాయకులు అంటే మేము నమ్మాలి
కూటమికి అర్ధం కళ్లకు కట్టినట్లు చూపారు.

ఎవరి పట్ల ఎవరు స్వామి భక్తి చూపుతున్నారో మాకు తెలిసినా, మేము చెప్పలేము. కానీ మీరు నమ్మిన అయోధ్య రామయ్యే గమనిస్తున్నారు.

సగం జీవితం ఢిల్లీలోనే కాపు వేసి.. ఓడిన సీట్లు అంటూ పైకి యేడుస్తూ…లోలోపల అభ్యర్థి పేరు చెప్పలేక నీళ్లు నమలటమే కాకుండా, కొత్తగా వింత వింత కుంటి సాకులు వల్లె వేస్తు…పైరవీలు చేస్తు నిజంగానే ఓడే సీట్లు ఎంపిక చేసుకున్నారు. శుభం భుయాత్
యత్ భావం తత్ భవతి.

ఎంత గొప్ప సాకులో వినండి..

నాకూ సీట్ ఇస్తే నిజాయితీగా ప్రజలకు సేవచేస్తా అనే వారొకరు ….
ఎంతైనా ఖర్చు చేస్తా !అతనికి మాత్రం సీట్ రాకుండా చేస్తాననే వారు మరొకరు..
అతనికి 1000 ఓట్లు కూడా రావు. సీట్ ఇవ్వకండి…..
అతనికి డిపాజిట్ కూడా రాదు..సీట్ ఇవ్వకండి..
అతనికి నోటాకన్నా తక్కువగా వస్తాయి. అందుకే సీట్ ఇవ్వకండి
అతనికి లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉంది సీట్ ఇవ్వకండి
అతని బావమరిది చెల్లి వియ్యపురాలి తోడికోడలు అక్క చెల్లెలి కూతురి ఆడబడుచు పెనిమిటికి, డ్రగ్స్ తో సంబంధం ఉందని అనుమానం అందుకని ఆయనకు సీట్ ఇవ్వకండి..
అతనికి జనసేన వాళ్లు సహకారం ఇవ్వరంట అందుకని సీట్ ఇవ్వకండి…
అతనికి టీడీపీ వాళ్లు సహకారం ఇవ్వరంట.అందుకని సీట్ ఇవ్వకండి…
ఇంటికి ఆలస్యంగా వచ్చిన మొగుడు కూడా ఇన్ని సాకులు చెప్పడు అనుకుంటున్న !

*యెగిరి ఎగిరి దంచినా ఒకటేకూలి….ఎగరకుండా దంచినా ఒకటే కూలి*
ఇది ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది .

నిజానికి బీజేపీ నేతలు ఎక్కడ పోటీ చేసినా దక్కేది ఒకటే ! అది అందరికీ తెలిసిందే .
ఎలాంటి నాయకుడు కావాలో నిర్ణయం తీసుకోలేని మీకు 400 కావాలి.

నికార్సయిన 16 మందిని ఎంపిక చేయటం చేత కాని జా(గన్)తీయ పార్టీ మాది. మాకు ఏపీ అంటే ప్రత్యేక అభిమానం.

చివరిగా.. మీరు చేసిన తప్పు ఏంటో,.నమ్మక ద్రోహం ఏంటో త్వరలో బయటకు వస్తుంది. కాలిన మీ చేతులకు ఆకులు ఎప్పటికీ దొరకవు. కూటమి కలయిక దురుద్దేశంతో కూడినది అయితే మాత్రం కూకటి వేళ్లతో కదిలే సమయం సమీపిస్తున్నది …

మీరు పూజకు పనికి రాని పువ్వులు అని మరోసారి నిర్ధారణ అయింది.

– డాక్టర్ శృతి

Leave a Reply