మోడీ నిజంగా మనిషేనా?

నమ్మలేకపోతున్నాం. మోడీ అసలు నిజంగా మనిషేనా?
అలుపు సొలుపు లేదా?
ఆకలి దప్పికల్లేవా?
కంటినిండా నిద్ర పోతాడా?
కడుపునిండా కూడు తింటాడా?
మాయల మాంత్రికుడా?
మర యాంత్రికుడా?
నిరంతర శ్రామికుడా?
అనితర సాధకుడా?
ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసెలవు తీసుకోడా?
ఎక్కడినుంచి ఇంత శక్తి?
కొలవగలమా నీ దేశభక్తి!

అవినీతి మరక లేదు..బంధుప్రీతి అసలే లేదు..
దేశం నిద్రపోతున్నా..నీ దేహము నిద్ర పోవట్లేదే!
విపక్షం నానామాట లంటున్నా..నీ కర్తవ్యం ఆపవే!
నిస్వార్థంగా,నిజాయితీగా నిరంతరంగా నీలాగా
పనిచేసిన ఒక్క రాజకీయ నాయకుడిని చూడలేదు!
ఏ మాయ చేసావో..ఏ మంత్రమేసావో అసలు…

అదే దేశం, అదే సైన్యం, అదే అధికారగణం, అదే జనం
బాంబుదాడులు, మారణహోమాలు, మరణాలు లేవు.
లక్షలకోట్ల స్కాములు, మతఘర్షణలు, మామూళ్లు లేవు
పిచ్చి అశ్లీల సినిమాలు, అసాంఘిక పనులు లేవు..

ఉప్పు, పప్పు, ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్ని అంటలేదు
దేశమంతా స్వచ్ఛ భారతావని వైపుగా, అభివృద్ధి దిశలో
దేశభక్తి సినిమాలతో, దేశభక్తి ఉపన్యాసాలతో
దేశమంతా దేశంపై ప్రేమను పంచారు.పెంచారు..

బుల్లెట్ ప్రూఫ్ ల్లో దాక్కొని ప్రసంగించే మౌన ప్రధానిని చూసిన చోట,
ఎర్రకోట సాక్షిగా, జాతీయ జెండా సాక్షిగా గుండె ధైర్యంతో, గుండెల నిండుగా దేశభక్తిని నింపుకొని స్వేచ్ఛగా మాట్లాడుతుంటే ఏమని వర్ణించగలం..
నీ పనితో, నీ మాటతో, నీ వ్యక్తిత్వంతో ఈ దేశ గతిని, ప్రగతిని,
ఖ్యాతిని మార్చిన మహానుభావుడా

370 ఆర్టికల్ ఎత్తేసి, అయోధ్యలో రామమందిరం కట్టేసి, కరోనా మహమ్మారి నుంచి కాపాడి, ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి, రేషన్ బియ్యం ఇచ్చి, దేశవ్యాప్తంగా వందల రెట్ల వేగంతో అభివృద్ధి జరుగుతున్నా..

ఈరోజు జనం కంటినిండా హాయిగా నిద్రపోతున్నా..
దేశం కోసం 18 గంటలూ పని చేసే
నీవు ఓడిపోతే నీకు పోయేదేం లేదు…
అదే జోలె పట్టుకొని నీ పని నీవు చూసుకుంటావు..
కానీ నీలాంటి కర్మయోగిని మళ్ళీ చూడలేం..

అందుకే నిన్ను గెలిపించుకొనే బాధ్యత ప్రతీ భారతీయుడిది.

– పులగం సురేష్

Leave a Reply