రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతున్న రెడ్డి సంఘాలు

రెడ్డి సంఘాలను ఎంతవరకు నమ్మాలి ? ప్రతి రెడ్డి దీనిపై తిరుగుబాటు చేయాలి. రెడ్డి అంటే ఒక గౌరవం ఉంది రెడ్డి అంటే ఒక భరోసా ఉంది దానిని మనం వమ్ము చేసుకోకూడదు. ఆధిపత్యపోరులో రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతున్న రెడ్డి సంఘాలు. అమాయక గ్రామీణ ప్రాంతాల రెడ్డిలను, మాయల మరాఠీ లాగా మాయలు చేస్తూ.. అదిగో పులి ఇదిగో వచ్చే అన్నట్లు, తప్పుడు ప్రకటనలతో, తప్పుడు మెసేజ్ లతో రెడ్డిల జీవితాలతో ఆడుకుంటున్న రెడ్డి సంఘాల నాయకులమని చెప్పే వారిని తరిమికొట్టండి.

ఎవరి కి వారు సంఘాల పేర్లు పెట్టుకొని.. నేనంటే నేను గొప్ప అంటూ, ప్రతినిత్యం ఆధిపత్య పోరుతో ఎలక్షన్లు రాగానే, ఏదో ఒక పార్టీకి మద్దతు చెబుతూ, అమ్ముడుపోయి.. మేమే రాష్ట్రంలో మొత్తం తెలంగాణలో ఉన్న రెడ్డిల ఓట్లను మీ పార్టీకే గుండు గుత్తగా ఓట్లు వేయిస్తామని.. మేమంతా మీ వెంటే ఉంటామని మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలకు మనను అమ్ముకుంటున్నారు, ఇది మీకు ఎంతమందికి తెలుసు?

మిత్రులారా .. గత కొన్నాళ్ల నుండి మీరు రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లలో చూస్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ పడగానే.. ఆయా పార్టీల దగ్గరికి వెళ్లి , రాష్ట్రంలో మా ఓట్లు గిన్ని ఉన్నాయి. మాకు ఏమిస్తారు అని చెప్పి బహిరంగంగానే అడిగినవారు ఉన్నారు. ఒక్కడేమో పాదయాత్ర అంటాడు. ఒకడేమో బహిరంగ సభ అంటాడు. ఇంకొకడేమో ధర్నాలు అంటాడు. ఇంకొకడేమో ఆత్మీయ సభలంటాడు. మనమేమో వారిని నమ్ముతాము. అందరూ చేసేది మన మంచికే అని చెప్పి మనం భ్రమల్లో ఉన్నాం. కానీ వాడు మనను గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టి అందరిని అమ్ముకుంటున్నారు.

ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తూ అమ్ముడు పోయే రెడ్డి సంఘాల నాయకులను ఏమనాలి? ఎంత అనాలి? ఇవాళ పూటకులేనివారు.. సంఘాల పేరుతో పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకొని, పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారు ఈ డబ్బంతా ఎక్కడిది?

రెడ్డి సోదరులారా మీరంతా గమనించాలి. ప్రతి కులంలో… ప్రతి నాయకుల్లో.. ప్రతి పార్టీలో రెడ్డిలు అంటే ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. కానీ అమ్ముడు పోకూడదు. మనము తప్పుడు దారిలో, మాయ మాటలతో నడిపిస్తున్నటువంటి వారిని నమ్మకూడదు.

అమాయక రెడ్డిలను వాడుకొని రాజకీయాలు చేసి, కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్న నాయకుడు, రకరకాల సంఘాల పేరుతో రకరకాల ఉద్యమాల పేరుతో ఏదోరకంగా పోగ్రాములు చేస్తామంటే నమ్మకండి.

కొంతమంది హైదరాబాదులో పాగా వేసి .. సంఘాలు వారి జీవన ఆధారంగా మలుచుకుని, మంత్రులతో సత్సంబంధాలు పెంచుకొని.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పైరవీలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు సంపాదిస్తూ, రెడ్డిలను తాకట్టు పెడుతున్నారు జాగ్రత్త.
సంఘం రాష్ట్రంలో ఒకటే ఉండాలి.

ఆ సంఘ నిర్మాణం ఎలా ఉండాలంటే.. గ్రామ కమిటీలు మండల కమిటీలు, జిల్లా కమిటీలు ప్రతిష్టంగా పునర్నిర్మాణమై.. రాష్ట్రంలో ఒకే సంఘం అది కూడా, ప్రతి రెడ్డి ఎలక్షన్స్ లో ఎన్నుకున్నవాడే అధ్యక్షుడు కావాలి . ఏమంటారు? మీ అభిప్రాయం ఏమంటారు?

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )