Suryaa.co.in

Political News

జగన్ ఐదేళ్లపాలనలో మెరుపుల కంటే మరకలే ఎక్కువ

– జగన్ పాలన- సమగ్ర అంశాలపై విశ్లేషణ
( పిపిఎన్ ప్రసాద్)

జగన్ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశాల్లో కీలకమైనవి.. మూడు భాగాలుగా విభజిస్తే.. సంస్కరణలు.. వ్యక్తిగత అంశాలు.. రాష్ట్ర అంశాలు. ఈ ఏడాది ఎన్నికల జరిగే అవకాశం నేపథ్యంలో పురోగతి ఫలితాలు పై ఒక విశ్లేషణ.

1. సంస్కరణలు:

నాడు నేడు: బడుల ఆధునీకరణ ఆంగ్ల మాధ్యమం లో బోధన వలన సానుకూలత ఉంది అయితే ఉపాధ్యాయుల నియామకం చేపట్టి దశలవారీగా ఆంగ్ల మాధ్యమం లో విద్యా బోధన చేపట్టి ఉంటే.. భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు ఉండేవి. బడుల విలీనం పెద్ద మైనస్. నాడునేడు & అమ్మ‌ఒడి వలన ఆమేరకు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగిన దాఖలాలు లేవు.

సచివాలయాలు: పని తక్కువ ఖర్చు ఎక్కువ 70 వేల మంది ఉద్యోగుల రెగ్యులర్ . ఇంత వ్యవస్థ ఉండి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ఆరు నెలలు ఆగాల్సిరావడం ప్రధాన లోపం. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసి సర్పంచుల అధికారాలకు కత్తెర వేసి న్యాయస్థానం లో వెనక్కి తీసుకుంది. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు పక్కదోవ పట్టించడం గ్రామాల అభివృద్ధి కి బాగా నష్టం.

వాలంటీర్లు: పింఛన్లు ఇంటింటికీ పంచడానికి ఉపయోగం మిగతా పెద్దగా ఉపయోగం లేదు అంతమంది అవసరం లేదు పార్టీకి వీరి వలన ఉపయోగం కానీ వీరికి పార్టీ వలన ఉపయోగం లేదు. 2 లక్షల మంది యువత కేవలం 5 వేలు వేతనంతో ఎదుగుబొదుగు లేక నష్టపోయింది.

రైతు భరోసా కేంద్రాలు: రైతులకు కొంత లబ్ది కొంత ఉంది కానీ ప్రచారం చేసినంత లేదు. ఆర్భాటం జాస్తి. ధాన్యం కొనుగోలు డబ్బు సకాలంలో ఇవ్వకపోవడం మైనస్.

భూ హక్కు భూ రక్ష: 1.26 కోట్ల హెక్టార్లలో రీ సర్వే లక్ష్యం ఆ మేరకు వేగంగా కదలడం లేదు.‌ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అయిన ప్రభుత్వపరం అయిన భూముల వివరాలు లేవు. న్యాయస్థానం ఆశ్రయించే అవకాశం లేకపోవడం వలన భూ యజమానులకు భారీ ప్రమాదం పొంచి ఉంది

జిల్లాల పెంపు: ఇచ్చిన మాట ప్రకారం పెంచారు. అయితే వివాదాలు ఎక్కువ అవడంతో ఆశించిన సానుకూలత లేదు. ఓవైపు రాష్ట్ర అంశంలో పరిపాలన వికేంద్రీకరణ అని ప్రచారం చేస్తూ, జిల్లాల అంశంలో ఒకే చోట కార్యాలయాలు అన్నీ ఉండేలా, ఇంటిగ్రేటెడ్ నిర్మాణాలు అనేది ద్వంద్వ వైఖరి. కనీసం భవనాలు కూడా నిర్మాణాలు కూడా లేవు.

టిడ్కో ఇళ్ళు : ప్రస్తుతం ఇచ్చింది 40 వేలు. ఇవ్వాల్సింది 2.20 లక్షలు. రూపాయికి అన్నారు. ఏమైందో తెలియదు.

ఓటిఎస్ , లే అవుట్ & క్రమబద్ధీకరణ: ఈ మూడూ డిజాస్టర్ విధానాలు అయ్యాయి. జగన్ పై జనానికి విశ్వసనీయత కొరవడటమే వైఫల్యాలనికి కారణం.

మోటార్లకు మీటర్లు: రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల రైతుల మోటార్లకు మీటర్లు లక్ష్యం. రైతులు ముందు బిల్లు చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం రైతులకు ఇస్తుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు సర్దుబాటు కావడం లేదు. మరి రైతులకు బిల్లులు చెల్లింపులు అంటే కష్టమే.‌

విద్యా దీవెన: ఫీజు రీయింబర్స్మెంట్ పాతది. అయినా ప్రచారం ఘనం. చెల్లించే విధానం భిన్నం. ఓట్ల కోసం విద్యాసంస్థలకు సిబ్బందికి నరకయాతన విధానం. మళ్ళీ జగన్ వస్తే సగం విద్యాసంస్థలు మూతపడతాయి.

బయోమెట్రిక్: మొదట్లో ఉపాధ్యాయులకు మాత్రమే అని అనుకున్నా, ఆ తర్వాత అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫేస్ యాప్ ద్వారా హాజరు. జగన్ తీసుకున్న ధైర్యమైన నిర్ణయం అభినందించక తప్పదు.

సుపరిపాలన: కక్ష సాధింపు ప్రత్యర్థి పై కేసులు ఆర్థిక మూలాలను దెబ్బతీయడం విధ్వంసవికేంద్రీకరణ ఇలా అర్థం మార్చారు

2. వ్యక్తిగత లబ్ది అంశాలు

గృహ నిర్మాణం: లక్ష్యం బారెడు చేరుకుంది బెత్తెడు. పాతిక శాతం పూర్తి అవలేదు. కేంద్రం ఇచ్చే డబ్బును సర్దుబాటు చేసి మీరే కట్టుకోండి అంటూ పురమాయించారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం కూడా ఇవ్వరు.

మెడికల్ కాలేజీలు: లక్ష్యం 17 పూర్తి 5 అందులో మూడు పాతవి అప్‌గ్రేడ్ చేసినవి. అందులో సగం సీట్లు పేద మధ్యతరగతి వారు భరించేలా లేవు. ప్రచారానికి మాత్రమే బాగుంటుంది.

ఉద్యోగుల రెగ్యులర్: రాష్ట్రవ్యాప్తంగా 36 శాఖల్లో ఉన్న 60 వేల మంది ఉద్యోగుల్లో 10 వేల మందికి రెగ్యులర్. 2.6 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఊసే లేదు జీతాల పెంపు కూడా అంతంతమాత్రంగానే.

ఏటా ఉద్యోగ కేలండర్: గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది ఆశావహులు ఉండే ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ లేదు. ప్రైవేటు లో కూడా ఉద్యోగ అవకాశాలు తక్కువ. మొత్తంగా యువత భారీగా నష్టపోయినట్లే అనుకోవాలి.

మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు: మొదట్లో 80 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అని ప్రకటించినా, ఆ తర్వాత అవి 13 కి చేరాయి. వాటిలో కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నవి కేవలం 3.
మండలానికి ఒక మహిళ ఇంటర్ కళాశాల జీవో ఇచ్చారు. లెక్చరర్ల నియామకాలు చేపట్టలేదు. అడ్మిషన్లు లేక అగచాట్లు పడుతున్నారు.

నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రం. ఇవి కేవలం మాటలకు పరిమితం.‌ లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి.

3. రాష్ట్ర ప్రయోజన అంశాలు

హోదా విభజన హామీలు పోలవరం: చేతులు ఎత్తేశారు. గత ఎన్నికల ముందు ఇవే ప్రధాన అంశాలుగా మేధావులు విరుచుకుపడ్డారు. ఇప్పుడు మౌనం వహించారు రోడ్డు మ్యాప్ రయ్ రయ్ ఇలా ఐదేళ్ళుగా కామెడీ అయినా, కేంద్ర పరిధిలో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం ఎక్కువగా ఉండటం వలన కొంత కలిసొచ్చింది. రైల్వే సహా కేంద్ర రాష్ట్ర ఉమ్మడి ప్రాజెక్టుల్లో రాష్ట్ర వాటా ఇవ్వలేదు. చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. జిల్లాకో విమానాశ్రయం ఒక కామెడీ.‌ ఓర్వకల్లు కూడా బాబు హయాంలో ఎక్కువగా పూర్తి అయింది కాబట్టి అదొక్కటే ప్రారంభోత్సవం చేసి మమ అనిపించారు. ప్రైవేటు ఉపాధి కల్పనకు అవకాశం ఉన్న పరిశ్రమల అంశంలో జగన్ సర్కార్ వైఫల్యం బాగా కనపడుతుంది.

రైతు ప్రభుత్వం అని ప్రచారం చేసినా , జల ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతి అంతంత మాత్రమే. ఇప్పటికి ప్రారంభించినవి కేవలం 5 అయితే రైతు భరోసా కింద చెప్పింది 13500. ఇచ్చింది 7500. సూక్ష్మ సేద్యం ప్రకృతి వ్యవసాయంలో ప్రోత్సాహకాలు కూడా అంతంత్రమాత్రంగానే.

ఇక ప్రధానమైనది “మూడు రాజధానులు” ప్రాంతీయ చిచ్చు ద్వారా లబ్ది పొందే ప్రయత్నం చేసినా విఫలం.

మొదటినుంచి చెప్తున్నది ఇప్పుడు చెబుతున్నది ఒకటే.. జగన్ సర్కార్ పై సానుకూలత ఏదైనా ఉంది అంటే అది ఒక సంక్షేమం పప్పులు బెల్లాలు మాత్రమే. అవే చాలు అని జనం అనుకుంటే వైనాట్ 175 . రాష్ట్ర భవిష్యత్తు సంస్కరణలు ఫలితాలు అభివృద్ధి కూడా జనం ఆలోచిస్తే టిడిపి 120+

LEAVE A RESPONSE