Suryaa.co.in

Andhra Pradesh

దేశ రాజధాని ఢిల్లీలో కలకలం

-జగన్‌ పాలనలో అరాచకాలపై వేలు నరుక్కుని మహిళ నిరసన
-ఇండియా గేట్‌ ఎదుట ఘటన

-ప్రత్తిపాడులో మాఫియాను అరికట్టాలని వినతి

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరాచకాలపై చేతి బొటన వేలు నరుక్కుని ఓ మహిళ నిరసన తెలిపింది. ఈ ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. గుంటూరు రూరల్‌కు చెందిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు అయిన కోపూరి లక్ష్మి ప్రత్తిపాడులో ఉంటోంది. నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సీజేఐకు వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం ఢిల్లీ వచ్చింది.

ఈ సందర్భంగా ముందుగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రత్తిపాడులో మహిళలతో గంజాయిని అమ్మిస్తున్నారని, ఫోర్జరీ చేసి భూముల రికార్డులను మారుస్తున్నారని, మహిళలను


బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని వివరించింది. మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలపైనా ఏకరువు పెట్టింది. అనంతరం ఇండియా గేట్‌ దగ్గర ఏకలవ్య దీక్ష అంటూ బొటన వేలు నరుక్కుంది. మహిళలకు న్యాయం జరగాలనే, రాష్ట్రంలో అరాచకాలను వివరించేందుకే ఈ పనిచేశానని, ఈ పని చేసినందుకు తప్పుగా భావించవద్దని కోరారు.

వేలు కోసుకుంటే స్పందిస్తారా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌
వేలు నరుక్కున ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్పందించారు. వైకాపా అరాచ కాలు, అవినీతిపై పోరాడుతున్న ఉద్యమకారిణి మీరు… ఢల్లీిలో వైకాపా అక్రమాలను ఎలుగెత్తి చాటుతున్నారు. సొంత బాబాయ్‌ గుండెలను చీల్చిన వారు… మీరు వేలు కోసుకుంటే స్పంది స్తారా? నిరసన తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇటువంటి చర్యలకు పాల్పడవ ద్దు. అసుర పాలన అంతానికి అంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE