Suryaa.co.in

Political News

వామ పాము…జర్మన్ కమ్యూనిస్టు…ఒక కాంగ్రెస్

మార్చ్ నెల 1933 లో రీచ్ స్టాగ్ భవనం..అంటే జర్మనీ పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టాడు… తగలబడి పోతున్న పార్లమెంటు భవనాన్ని రక్షించడానికి విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది… అంతకుముందు నాలుగు వారాల క్రితమే హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యాడు.

తిక్కలేచిన హిట్లర్ దాన్ని ఉపయోగించుకుని , జర్మనీ లో ప్రజాస్వామ్యం రద్దు చేసి పారేసి…హింస మొదలు పెట్టాడు. హిట్లర్ కూడా ఇక్కడి ఇందిరా గాంధీ లాగే, ఎమర్జెన్సీ పెట్టేసి…ప్రతిపక్ష నాయకులను జైళ్లలో కుక్కేసిన బాపతు. తరువాత ఆ లుబ్బె కి మరణ శిక్ష విధించారు.

అయితే ఎప్పటిలాగే కమ్యూనిస్టులు, ఆ నిప్పు పెట్టింది నాజీ లే అని ప్రచారంలో పెట్టీ…ఒక సందిగ్ధాన్ని ప్రపంచ చరిత్రలో వదిలేశారు. అదే మొన్నామధ్య కొందరు భారత పార్లమెంటు భవనంలో నిప్పు పెట్టడానికి ట్రై చేశారు… గుర్తొచ్చిందా?

అంటే సేమ్ ఇక్కడ కూడా అలాగే ప్రోవోక్ చేసే పని చేశారన్న మాట… ఈ వామ పాములు చరిత్ర అర్థం చేసుకోవడం లో ఎప్పుడూ…చారిత్రిక తప్పిదాలు చేస్తూనే ఉంటారు..
జర్మనీని…భారత్ ను పోలిక తెచ్చి…మెజారిటీ వాదం అత్యంత ప్రమాదకారి అంటూ తలతిక్కల మూర్ఖపు వాదనలు వినిపించి ఇక్కడా అదే జరుగుతుందంటూ ప్రచారంలో పెడుతూ ఉంటారు.
వాళ్ళూ అదే భ్రమలో ఉండి…అవే చెత్త ప్లాన్లు అమలు చేస్తూ ఉంటారు…
సోషల్ మీడియా యుగంలో …ఇంతలా టెక్నాలజీ పెరిగిన ఇప్పుడు కూడా….అదే తరహా వ్యూహాలు..
ఆ ట్రాప్ లో మోడీ పడలేదు.
హిందుత్వ జాతీయవాదులు అస్సలు పడరు.

దాంతో…
రాహుల్ నుంచీ…కడియం శ్రీహరి వరకూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అంటూ ఒకటే గబ్బు పాట…మొదలు పెట్టారు.
ప్రజాస్వామ్యం అంటే పడని కమ్యూనిస్టుల పాట.
రామచంద్ర గుహ అట…చరిత్ర కారుడట…ఆ కొద్ది మనిషీ అదే వాగుడు.

అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి?
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే…రాజ్యాంగాన్ని కాపాడాలంటే…
కేజ్రీ నీ… కవితను…సోరేన్ ను…ఇతర రాజకీయ అవినీతి నిందితులను వెంటనే విడుదలచేయాలి…
శివ కుమార్ ను…కేసీఆర్ ను..జగన్ ను…రేవంత్ ను ఇలా ఎవ్వరినీ కేసుల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు.
ఈ డి.. సీ బీ ఐ వంటి సంస్థలను రద్దు చెయ్యాలి.
ఓటింగ్ మెషిన్లను తీసేసి…కాగితాల మీద పేరు వ్రాసి ఇచ్చే పద్ధతి తీసుకు రావాలి.
రాజకీయ కుటుంబాలకి రాష్ట్రాల్లో వెంటనే అధికారం బదలాయించాలి.
కేంద్రంలో నెహ్రూ గాంధీ కుటుంబానికి అధికారం అప్పజెప్పాలి.
కమ్యూనిస్టులను తిరిగి అన్ని నామినేటెడ్ పోస్టుల్లోనూ వెంటనే నియమించాలి.
370 అధికరణం పునరుద్ధరించి…కశ్మీర్ లోకి పాకిస్తాన్ వారిని యధేచ్చగా అనుమతించాలి.
దేవాలయాల ప్రక్కనే మసీదులన్నీ బాబర్ అక్బర్ ఔరంగ జేబ్ పేర్లతో ఉద్ధరించాలి.
చర్చిలకు ఖర్చుల కోసం ప్రత్యేక నిధిని హిందూ దేవాలయాల నుంచి ఏర్పాటు చేయాలి..
జడ్జీలుగా పూర్తి పారదర్శకంగా ఫెడరల్ ఆకాంక్షలకు అనుగుణంగా…ఇండీ కూటమి సూచించిన వారినే నియామకం చెయ్యాలి.
వందే భారత్ వంటి రైళ్ళను తీసేసి…అన్నీ పాసింజర్ రైళ్ళను నడపాలి.
డిజిటల్ పేమెంట్ తీసేసి…నగదు పద్ధతుల్లోకి వ్యవస్థను మార్చేయాలి.
నక్సలైట్లే దేశభక్తులని ప్రచారం చేయాలి.
అదన్నమాట సంగతి.
పార్లమెంట్ లో పొగ పెట్టినది ఫెయిల్ అవడంతో…ప్రజల్లో ఈ నిప్పు మొదలు పెట్టారు.
అది ఆరిపోతుంది…
ఎందుకంటే ఇది గోబెల్స్ యుగం కాదు…
జైహింద్!

– కిస్మత్

LEAVE A RESPONSE