Suryaa.co.in

Political News

భజనపరుల అత్యుత్సాహం జగన్‌కే ప్రమాదం

జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి అధికారి సలహాదారుల ఆలోచనలో, సూత్రధారుల ఆలోచనలో తెలియదు కానీ చేటు తెచ్చేది మాత్రం నాయకుడికే. అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, చిన్నాన్న మర్డర్ కేసు కావచ్చు, కోడి కత్తి డ్రామా కావచ్చు, అమరావతి రైతుల ఆక్రందన కావచ్చు, రాజధాని లేకపోవడం కావచ్చు, నిర్మాణంలో ఉన్న రాజధానిని కొనసాగించకపోవడం కావచ్చు, మీరు చెప్పిన మూడు రాజధానుల ఊసే లేకపోవడం కావచ్చు,

కేంద్రం ఇచ్చిన దళితుల పథకాలు నీరుకార్చడం కావచ్చు, దళితుల శిరో ముండనం కావచ్చు, దళిత బిడ్డలు డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలు, చీరాలలో ఇసుక దోపిడిని ఆపిన దళితుడిని చంపివేసింది కావచ్చు, వాటి వెనుకున్న నాయకులు పాత్ర కావచ్చు, 30 వేల మంది ఆడపిల్లల అదృశ్యం కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు కావచ్చు, లెక్కకు మించి రాష్ట్రం నెత్తినేసిన అప్పులు కావచ్చు, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల దౌర్జన్యం కావచ్చు, ఏ ఎమ్మెల్యే కు ఏ ప్రకృతి వనరుంటే ఆ వనరులను దోచుకున్న పరిస్థితి కావచ్చు,మీరు చెప్పిన మద్యపాన నిషేధం అమలు చేయలేకపోవడం కావచ్చు.

మద్యం ధర ₹ 60 నుండి ₹180 పెంపు కావచ్చు, అది డిజిటల్ కరెన్సీ లో లేకపోవడం కావచ్చు, సీపిఎస్ ను అమలు చేయలేకపోవడం కావచ్చు, ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ వాడుకున్న పరిస్థితి కావచ్చు,213 హిందూ దేవాలయాల ధ్వంసం కావచ్చు, హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆర్థిక వనరులను ఇతర మతాలకు ఖర్చు పెట్టడం కావచ్చు, సెంటు భూమి కొనుగోలులో ఎమ్మెల్యేలు దోచుకున్న కమిషన్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు లబ్ధిదారులకు పంచ లేకపోవడం కావచ్చు, కేంద్రం ఇచ్చిన రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడం కావచ్చు, ఇసుకను ఒకే కాంట్రాక్టర్కు ఇచ్చి ఆ డబ్బు ప్రభుత్వానికి సరైన లెక్కలోకి రాకపోవడం కావచ్చు.

రాష్ట్ర అభివృద్ధిలో వెనుకపడడం కావచ్చు, పరిశ్రమలు స్థాపించలేకపోవడం కావచ్చు, ఆర్థిక అభివృద్ధిని పెంచలేకపోవడం కావచ్చు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లేకపోవడం కావచ్చు, మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ అమలు చేయలేకపోవడం కావచ్చు, పోలీసుల అత్యుత్సాహంతో ప్రతిపక్షాల మీద ప్రజల మీద చేస్తున్న అరాచకాలు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం చట్ట ప్రకారం కాకుండా ఇస్టారీతిన ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు విని ప్రజల్ని అష్ట కష్టాలు పెడుతున్న పరిస్థితి కావచ్చు.

క్యాపిటల్ నిర్మాణం ఆపివేయడం కావచ్చు, గజిట్ పబ్లిష్ ప్రకారం రాష్ట్రంలో ఉన్న హౌస్ హోల్డ్స్ ఒక కోటి 48 లక్షలైతే, మీ ప్రభుత్వ లెక్క ప్రకారం వైట్ కార్డు హోల్డర్స్ ఒక కోటి 40 లక్షల మంది ఉండడం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయంలో ఫెయిల్ అయిన ప్రభుత్వాన్ని సాగనంపడం లో పై వందిమాగదులదే పాత్ర ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి చాలా చేటు.

అన్ని జిల్లాలలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకం,రవాణా మీద ఎక్కడెక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా భారీ యంత్రాలతో త్రవ్వకాలు జరిగాయో నివేదిక ఇవ్వమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖను ఆదేశించి, ఆ నివేదికను హైకోర్టుకు సమర్పించమని ఆదేశిస్తే.. రాష్ట్ర మైనింగ్ శాఖకు చెందిన ఒక్క కృష్ణాజిల్లా మైనింగ్ అధికారి మాత్రమే అక్రమ తవ్వకాలు భారీ యంత్రాలతో చేశారని ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు.

ఆ రిపోర్టు గనుక కోర్టుకు చేరితే మిగతా రాష్ట్రంలో ఉన్న దొంగలు అందరూ బయటపడిపోతారని శిక్షలు తప్పవని భయపడి ఆ రిపోర్టు హైకోర్టుకు చేరకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.మిగతా అందరూ అక్రమ తవ్వకాలు జరగలేదని రిపోర్ట్ ఇచ్చారు. దీనిని బట్టి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల పెద్దలు చేసిన తప్పులను వీరూ కొన్ని చేస్తూ సంపాదించుకుంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.

అయితే ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే.. తప్పు చేసిన ప్రతి అధికారి తిరిగి జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తే మన తప్పులన్నీ కప్పిపుచ్చుకొని ఎటువంటి విచారణలు, చేసిన తప్పుకు శిక్షలు లేకుండా ఉంటాయని వారి భావన. అందుకే కొన్ని నియోజకవర్గాలలో వారి పరపతిని కూడా ఉపయోగించి వారి బంధువుల ద్వారా వైఎస్సార్సీపీ కి పనిచేస్తున్నారు.

గతంలో చాలా సార్లు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల , భార్యల విషయం మాట్లాడి పెళ్ళాలు పెళ్ళాలని అగౌరవంగా మాట్లాడి ప్రజలలో చులకనైన విషయం ప్రజలు మర్చిపోలేదు. ఏ నాయకుడైనా ఏ నాయకుడి మీదనైనా కూడా అసందర్భ, అనవసర మాటలు మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారనుకోవడం భ్రమ..వ్యక్తిగత విషయాలను పదేపదే రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది ప్రెస్స్టేషన్ లోకి వచ్చారనిపిస్తుంది.

నాయకుడిచేత లబ్ధి పొందడానికి అధికారం ఉంది కదా అని, ఇష్ట ప్రకారం అధికారులు, అధికార రాజకీయ నాయకులు వ్యవహారాలు చేస్తే.. అది అడ్డం తిరిగి వారికే తగులుతాయని, శిక్షలు తప్పించుకోలేరనే దానికి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. పాపం పండనంతవరకు అందరూ రాజులే . పాపం పండిన తర్వాత అందరూ ఖైదీలే. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న వాళ్ల గురించి ఒకసారి ఆలోచించుకోండి.

ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటట్లుగా వ్యవహారాలు చేస్తే ప్రజలు సహిస్తారనుకోవడం, తిరిగి వారికే అధికారం కట్ట పెడుతారనుకోవడం, అత్యుత్సాహం ప్రదర్శించడం ప్రజలు సహిస్తారనుకోవడం ప్రజాస్వామ్యానికే చేటు వేచి చూద్దాం ఏమవుతుందో.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE