వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి

-అర్చక సోదరులపై వైసిపి దాడి దుర్మార్గం
-టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్

రాష్ట్రంలో వైకాపా మూకల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితులు కల్పించారు. తమ ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. శివాలయంలో పూజ సరిగా చేయలేదంటూ కాకినాడలో వైసిపి నేత సిరియాల చంద్రరావు ఆలయ గర్భగుడిలో స్వైరవిహారం చేసి పూజారులపై దాడికి తెగబడ్డారు. భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాసలేని అర్చకులపైనా ప్రతాపం చూపడం దుర్మార్గం. కాకినాడలో ఆలయ పూజారులపై దాడిచేసిన వైసిపి నేతను తక్షణం అరెస్టుచేయాలి. మరో 2నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతోంది… ఈలోగా రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలను స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి విన్నవిస్తున్నాను.

Leave a Reply