Suryaa.co.in

Telangana

మేడిగడ్డకు ఒక నీతి, సుంకిశాలకు ఇంకో నీతా ?

– మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: మేడిగడ్డకు చిన్న మరమ్మత్తులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశమున్నా బీఆర్ఎస్ ను బద్నామ్ చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సుంకి శాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడ బయట పడతాయోనని గుట్టు చప్పుడు కాకుండా రిపేర్లు మొదలు పెట్టింది.

సుంకిశాల మీద.. ఎక్స్పర్ట్ కమిటీ ఎంక్వయిరీ ఉండదు. విజిలెన్స్ కమిషన్ విచారణ ఉండదు. జ్యుడీషియల్ కమిషన్ ఉండదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండదు. ఇవేమీ లేకుండానే సైలెంట్ గా రిపేర్ చేయిస్తారు. కానీ అదే మేడిగడ్డలో రెండు పియర్స్ కుంగితే, అన్నీ ఉంటాయి

ఎన్డీఎస్ఏ, ఎక్స్పర్ట్ కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్స్, ఇంకా వివిధ సంస్థలు ఆ పియర్స్ రిపేర్ చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, కన్స్ట్రక్షన్ కంపెనీ రిపేర్ చేయడానికి సిద్ధం అని చెప్పినా కూడా కేవలం రాజకీయ స్వార్థం తో తెలంగాణ ప్రయోజనాలు కూడా పక్కకు పెట్టడం, కాంగ్రెస్ మార్కు “ప్రజా వ్యతిరేక-ప్రతిపక్ష వేధింపు ‘పాలనకు నిదర్శనం!

LEAVE A RESPONSE