– రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో రూ.1.20 లక్షల కోట్లు పెంచలేదా?
– బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతి పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని నేను ఖండిస్తున్నాను.
కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టే. అందులో మా పార్టీది, మాది ఒకే అభిప్రాయం. ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ATM లాగా వాడుకున్నది వాస్తవం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రధాని మోడీ, అమిత్ షా , జేపీ నడ్డా చెప్పిన మాటలే మా స్టాండ్ అని నేను ప్రకటిస్తున్నారు.
బీఆర్ఎస్ నేతల వైఖరి చూస్తుంటే ‘ఉట్లా చోర్ కోత్వాల్ డాంటే ‘ అన్నట్లు ఉంది. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో రూ.1.20 లక్షల కోట్లు పెంచలేదా?
ఆనాడు స్వయం ప్రకటిత ఇంజనీరుగా అవతారం ఎత్తి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపడితే, ఈనాడు ఆయన సుపుత్రుడు NDSA కంటే తానే తెలివైన మేధావిగా ప్రవర్తించడం సిగ్గుచేటు.