– రేవంత్ రెడ్డి కోసం బండి సంజయ్.. బండి సంజయ్ కోసం రేవంత్ రెడ్డి..
– సంజయ్ కి సిగ్గు ఉంటే బనకచర్ల కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి
– బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్ బంధం మరోసారి బయటపడింది. రేవంత్ రెడ్డి – బీజేపీ కలిసి తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టమైంది. బిజెపి కోసం కాంగ్రెస్, కాంగ్రెస్ కోసం బిజెపి అన్నట్టుగా రెండు పార్టీలు…. రేవంత్ రెడ్డి కోసం బండి సంజయ్, బండి సంజయ్ కోసం రేవంత్ రెడ్డి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును, తెలంగాణను ఎండబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. పైగా తెలంగాణ పరువు పోయింది అంటూ బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదం. గుజరాత్ వాళ్ళ చెప్పులు మోసినపుడు, కట్టిన కొద్దిరోజులకే చర్లపల్లి రైల్వే స్టేషన్ కూలిపోయినపుడు, దేశ రాజధానిలో ఎయిర్ పోర్ట్ కుప్పకూలినప్పుడు, లిఫ్టులు, రైల్వే గేట్లు జాతికి అంకితం ఇచ్చినప్పుడు, కరోనా మహమ్మారి సమయంలో కుర్ కురే లు పంచినప్పుడు మీరంటున్న పరువు ఏమైంది..?
తెలంగాణ బిడ్డలుగా బనకచర్ల అడ్డుకోవాల్సింది పోయి ఉల్టా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం.. బిజెపి – కాంగ్రెస్ , మోడీ రేవంత్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం. ఆంధ్రాకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చామని పోయి ఆంధ్రాలో కూర్చుని మాట్లాడే బండి సంజయ్ తెలంగాణకు పైసా తీసుకురాలేదు. అలాంటి బండి సంజయ్ కి తెలంగాణలో ఉండే అర్హత లేదు.తెలంగాణ హక్కులకోసం పదేళ్లపాటు కేంద్రంతో కొట్లాడిన బీఆర్ఎస్ పై మాట్లాడే హక్కు లేదు.
బండి సంజయ్ కి సిగ్గు ఉంటే బనకచర్ల కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. చంద్రబాబు ప్రయత్నాలను అడ్డుకునేందుకు బిజెపి అధిష్ఠానాన్ని ఎదిరించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం తెలియని బండి సంజయ్, సొంత పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్లి ఆయనతో క్లాసులు చెప్పించుకుంటే మంచిది. లేకపోతే బండి సంజయ్ మాట్లాడే మాటలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఉత్తర తెలంగాణ ప్రజలు ముఖం మీద ఉమ్మేస్తారు.