– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ
విద్యార్థుల భవిష్యత్‍ను తీర్చిదిద్దే ఆధునీక దేవాలయాలాంటి విశ్వవిద్యాలయాల్లో వీసీ ప్రాసాద్‍రెడ్డి వారు చేరి వాటిని రాజకీయ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆంధ్రయూనివర్సిటీ వీసీ ప్రసాద్‍రెడ్డి వైసీపీ కోఆర్డినేటర్‍గా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులను బెదిరించి, భయపెట్టి వైసీపీ గర్జనకు తరలించారు. ప్రసాద్ రెడ్డి వైసీపీ వాలంటీర్‍గా పనిచేయడం సిగ్గుచేటు. ఎంతోమందిని మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆంధ్ర యూనివర్సిటీకి చెడ్డపేరు తెస్తున్న ప్రసాద్‍రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర యూనివర్సిటీ పేరును చెడగొడుతున్నారు. విద్యార్థుల జీవితాలను బలి చేసే ప్రయత్నాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రసాద్ రెడ్డి రాజకీయాలు చేయాలనుకుంటే యూనివర్సిటీ భయట చేయాలి కానీ.. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. మాదక ద్రవ్యాలు యూనివర్సిటీలో అమ్ముతున్నారని తెలిసినప్పటికీ వీసీ దానిని ప్రోత్సహించడం దారుణం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ప్రసాద్ రెడ్డిని బర్థరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.