– తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్
– ఎక్స్ లో ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ : రోజు మీరు కూర్చుంటున్న సెక్రటేరియట్ లో కేసీఆర్ ఉంటారు. మొన్న మీరు ఉద్యోగ సంఘాల మీటింగ్ పెట్టిన కమాండ్ కంట్రోల్ ప్రతి అడుగులో ఆ మహనీయులు కనిపిస్తారు. మీరు నిత్యం తిరిగే విదేశాలను తలపించే రోడ్లలో,ఫ్లై ఓవర్ లలో తెలంగాణ ప్రదాత కనిపిస్తారు.
ప్రజలు నిత్యం తాగే మిషన్ భగీరథ నీళ్లలో వారే కనిపిస్తారు. గ్రామాల్లో,పట్టణాల్లో కేసీఆర్ నల్లాలు, నీళ్లు అని అందరూ పిలుచుకుంటారు.
కాళేశ్వరం జల సవ్వడిలో,కాకతీయ చెరువు మత్తిడిలో, 24 గంటలు విరజిమ్మిన విద్యుత్ వెలుగుల్లో,గురుకుల బడుల్లో,యాదాద్రి గుడిలో,జిల్లాకో వైద్య కళాశాల విప్లవంలో కేసీఆర్ ఉంటారు.
జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ గారి విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి లాంటి తెలంగాణ ఔన్నత్యాన్ని చాటే వాటితో పాటు, రైతు బంధు, రైతు బీమా కాదు.. చెప్పుకుంటూ పోతే సంక్షేమానికే చిరునామా గా మారిన కేసీఆర్ పేరును చెరపటం ఎవరి తరం కాదు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్.