సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును సిఐడి అదుపులోకి తీసుకోవటం అన్యాయం

0
6

– ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు
– ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఐ.వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్

వాట్సాప్ లో ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినందుకు అంకబాబుపై ఇలా వ్యవహరించటం అప్రజా స్వామి కం.అంకబాబు ఆయన సతీమణి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో సిఐడి పోలీసులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లటం సరి అయింది కాదు.ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసు ఇవ్వకుండా అంకబాబును అజ్ఞాతంలోకి తీసుకెళ్లటం దారుణం.అంకబాబును తక్షణమే విడుదల చేయాలి. అంకబాబు ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి.

జర్నలిస్ట్ అంకబాబు అక్రమ నిర్భంధం అప్రజాస్వామికం: ఏపీయూడబ్ల్యూజే అర్బన్‌ ఖండన

కేవలం వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినందుకు సీనియర్ జర్నలిస్టు అంకబాబును అక్రమంగా నిర్భంధించిన సీఐడీ చర్యలను అప్రజాస్వామికమని ఏపీయూడబ్ల్యూజే ఎన్టీఆర్ అర్బన్ కమిటీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. అంకబాబు ఆయన సతీమణి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో సిఐడి పోలీసులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లటం సరి అయింది కాదన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసు ఇవ్వకుండా అంకబాబును అజ్ఞాతంలోకి తీసుకెళ్లటం దారుణమని పేర్కొన్నారు. అంకబాబును తక్షణమే విడుదల చేయాలని, అంకబాబు ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే ఎన్టీఆర్ జిల్లా అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మరాజు చలపతిరావు, ఆర్ వసంత్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.