Suryaa.co.in

Andhra Pradesh

అది మ్యానిఫెస్టో కాదు…జగన్ రాజీనామా లేఖ!

ఎన్నికలకు ముందే జగన్ అస్త్రసన్యాసం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత లోకేష్

మంగళగిరి: ఈరోజు జగన్ ప్రకటించిన ఎన్నికల మ్యనిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… 200 రూపాయల పెన్షన్ ను 2వేలు చేసింది చంద్రబాబునాయుడు, జగన్ అయిదేళ్లలో 500 పెంచుతానని మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఆయన దివాలాకోరు తనానికి నిదర్శనం.

ఎన్నికలకు ముందే జగన్ అస్త్రసన్యాసం చేసినట్లు వైసీపీ మ్యానిఫెస్టో స్పష్టం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమే… అధికారంలోకి వచ్చిన వెంటనే 3వేల పెన్షన్ ను 4వేలకు పెంచుతాం. పెన్షన్ సొమ్మును వాలంటీర్ల ద్వారా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి అందించే బాధ్యత నాది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సీపైనే చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని యువనేత లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE