కండువా వేసుకోవడమే‌ కాదు.. కండువా బాధ్యత కోసం పనిచేయాలి

– బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో పలువురు కృష్ణాజిల్లా నేతలు, కార్యకర్తలు 200 మంది చేరిక
– ఆడిటర్ శ్రీ నివాస్ నాయకత్వం లో బీజేపీ లో చేరిక
– పార్టీ కండువా వేసి బీజేపీ లోకి ఆహ్వానించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
– బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

విజయవాడ: ప్రజల్లో బిజెపి కి ఆదరణ పెరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు బిజెపి లో చేరేందుకు రావడమే ఇందుకు నిదర్శనం. మహిళలను లక్షాధికారిణి లను చేయడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం. అందుకే బిజెపి లో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు.

మోదీ అమలు చేస్తున్న పధకాలు ప్రజలకు చేరువవుతున్నాయనే ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. మహిళల సాధికారిత‌కోసం మోదీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. మోదీ హయాంలో డ్వాక్రా లోన్లను 20 లక్షలు పెంచారు.. తద్వారా ఒక్కో మహిళకు లక్ష నుంచి రెండు లక్షల దాకా‌ వస్తున్నాయి. మహిళా‌ సాధికారితపైన మోదీ కి ప్రత్యేక శ్రద్ధ. పొలాల్లో ఎరువులు, పురగుల మందు డ్రోన్ల ద్వారా చల్లే విధంగా మహిళలకు అవకాశం కల్పించింది మోదీ. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోదీ భర్తీ చేశారు.

మహిళలను ఏదో సంరక్షిస్తున్నామనే‌ విధంగా కాకుండా వాల్ళ కాళ్ల మీద నిలబడేలా మోదీ చేస్తున్నారు.బిజెపిలో చేరిన వారు పార్టీ లో చురుకుగా పనిచేయాలి. కండువా వేసుకోవడమే‌ కాదు కండువా బాధ్యత కోసం పనిచేయాలి ..అప్పుడే పార్టీ బలోపేతం చెందుతుంది. బిజెపి కి మీ సహకారం అవసరం.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, బిజెపి కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం , శేషు బాబు , అంగడాల సతీష్,కె.శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply