– శవ రాజకీయాలు చేస్తున్న జగన్‌రెడ్డి
– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అర్వపల్లి అంజనేయులు
అమరావతి: ‘‘ జగన్.. నీకు మెదడుందా? ఈరోజు సత్తెనపల్లి లో పరామర్శకు వెళ్లిన సందర్భం తెలుసా? అతను ఎప్పుడు చనిపోయాడో, ఎందువల్ల చనిపోయారో తెలుసా? పోనీ ఏ తేదీన చనిపోయాడో తెలుసా? అతను చనిపోయింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. మరి దానికి బాధ్యత ఎవరిది? అది కూడా తెలియకుండా పరామర్శకు వెళితే ప్రజలు నీకు మెదడు లేదనుకుంటారు’’ అని ఎద్దేవా చేశారు.
అరాచక శక్తుల ను ప్రోత్సహించడానికి జగన్ పర్యటనలు చేస్తున్నాడని శవ రాజకీయాలు చేయటం జగన్‌కి అలవాట ని, శవరాజకీయం చేయడానికి వెళ్లి ఒక మనిషిని శవంగా మార్చి వేశాడని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అర్వపల్లి అంజనేయులు ధ్వజమెత్తారు.
జగన్ రాత్రి చంపి పొద్దున్నే దండ వేసే టైపని నాగమల్లేశ్వరావు చావు కి జగనే కారణమని రాజారెడ్డి రాజ్యాం గాన్ని జగన్ అమలు చేసాడని, ఏ పార్టీ వ్యక్తిఅయినా చనిపోవటం బాధాకరంమని అన్నారు. ఏడాది తర్వాత నానా హంగామా చేస్తూ సత్తెనపల్లికి ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్ రెడ్డి.. బెట్టింగ్ కాసి అప్పుల పాలైన బెట్టింగ్ రాయుడు మల్లే శ్వరావుని, ఏడాది క్రితం చని పోతే ఇప్పుడు శవ రాజకీయం చేస్తున్నాడని, వైసీపీ ఉప సర్పంచ్ మల్లేశ్వరరావు మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం అంటు నానా యగిచేస్తున్నాడని విమర్శించారు. మరి అతను చని పోయింది బెట్టింగ్ వల్ల. అప్ప టికి జగనే అధికారంలో ఉన్నాడు. కూటమి అధికారం లోకి వచ్చింది 2024 జూన్12 న. మల్లేశ్వరరావు గడ్డి మందు తాగింది జూన్ 5 నని చనిపోయింది జూన్ 9 నని అంజనేయులు గుర్తు చేశారు.