జగన్ అన్న మీ దత్తపుత్రుడేగా?

-కావలసినప్పుడల్లా అప్పులిచ్చారు కదా?
-జగన్ – బాబును ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ
-భయపడుతున్నారా కాంగ్రెస్ కు?
– మోదీ వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఎద్దేవా

అటు జగన్ ను..ఇటు బాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ. పదేండ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా.? కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? ఐదేళ్లుగా జగన్ తో అంటకాగుతూ…వాళ్ళ అరాచకాలను అడ్డుకోకుండా, ఎదురు వారికి అడ్డగోలు సహాయ సహకారాలు అందిస్తూ, ఇంకా నాశనం చేసుకోండి. ఇంకా అప్పుతెచ్చుకోండి అంటూ..తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు అన్నది ఎవరినో. బీజేపీ ప్రతి బిల్లుకు పార్లమెంటులో సిగ్గువిడిచి సపోర్ట్ చేసింది జగన్ రెడ్డి సర్కారు.

మోడీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో..ఆస్తులు కట్టపెట్టి, వారికీ రాజ్య సభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు. ఇది వీరి స్నేహం, విడదీయరాని బంధం. హామీలు ఇచ్చింది కాంగ్రెస్, వాటిని తుంగలో తొక్కింది బీజేపీ, టీడీపీ, వైసీపీ. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రెస్ మీద పసలేని దాడులా? భయపడుతున్నారా కాంగ్రెస్ కు? అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదామీదే అన్న వాగ్దానం వణుకు తెప్పిస్తోందా?

Leave a Reply