పెన్షన్ అందకుండా జగన్ రెడ్డి కుట్రలు

ఈసీ ఉత్తర్వులివ్వగానే జగన్ రెడ్డి పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నాడు
వాలంటీర్లు పెన్షన్ ఇచ్చే విధానంలో పొరపాటుందని చీఫ్ ఎన్నికల కమిషన్ గమనించింది
పెన్షన్ల పంపిణీ సజావుగా సాగాలని, ఏ ఒక్క పెన్షన్‌దారుడు కూడా ఇబ్బందిపడకుండా చూడాలని చంద్రబాబు సీఎస్‌కు, సీఈవోకు లేఖలు రాశారు
1వ తేది నుంచి 5 తేది వరకు ప్రత్యామ్నాయ మార్గంలో పెన్షన్ సజావుగా అందేటట్లు చూడవలసిన బాధ్యత సీఎస్ జవహర్ రెడ్డిదే
తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు
జగన్ రెడ్డికి వాలంటీర్ల బానిసత్వానికే వ్యతిరేకం
రాత్రి పూట బాలినేని చీరలు కట్టుకుంటాడేమో!

– తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తాను ఓడిపోబోతున్నాడని తెలుసని ఎన్ని దొడ్డి దారులు తొక్కైనా, దొంగదారులు వెతుక్కొని అధికారాన్ని నిలబెట్టుకోవాలని జగన్ రెడ్డి పాటుపడుతున్నాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. ఆదివారం మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య పాల్గొన్నారు.

వాలంటీర్లపై ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలను వర్ల రామయ్య ఖండించారు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఎంత దిగజారైనా రాజకీయాలు చేయడంలో వైసీపీ ధిట్టా అని రామయ్య దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయడానికి వీలు లేదు. వేరే మార్గాల ద్వారా పెన్షన్ పంపిణీ చేయండని సీఎస్‌కి ఎన్నికల కమిషన్ ఉత్తర్వులిస్తే జగన్ రెడ్డికి తన ఒళ్ళంతా జెర్రిలు పాకినట్లు అయ్యింది. వాలంటీర్లు లేకపోతే ప్రజలు ఎవ్వరు తనకి ఓటు వేయరని, అతనికి విజయం లేదని, వారి మీదే పార్టీ నడుస్తోందని జగన్ రెడ్డి అనుకుంటున్నాడు.

ఇప్పుడు పెన్షన్ పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకపోతే తన పార్టీ ప్రజలకు దూరమవుతోందనే బాధతో జగన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు చంద్రబాబుకు ఏమిటి సంబంధం? చంద్రబాబు చేతిలో కేంద్ర ఎన్నికల కమిషన్ పని చేస్తోందా? వాలంటీర్ల వ్యవహారశైలి ఎన్నికల కమిషన్‌కు నచ్చలేదు. ఆ విధానం సరికాదని ఈసీ ఆదేశాలిచ్చింది. దీనిపై జగన్ రెడ్డి చెత్త రాజకీయాలు చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో అవ్వా తాతలకు పింఛను అందకుండా చంద్రబాబు చేశాడని తప్పుడు, నీఛపు రాజకీయాలు చేస్తున్నారు” అని మండిపడ్డారు.

“పెన్షన్ దారులెవ్వరూ భయపడాల్సిన పని లేదు. వాలంటీర్ల ద్వారా పంపిణీ వద్దంటే ప్రత్యమ్నాయ మార్గాలు చేస్తారు. ఒక్కరి పెన్షన్ కూడా పంపిణీ ఆగదు. ఒకవేళ జగన్ రెడ్డి ఆపాలని చూసినా ఆగదు. ఒక్క అవ్వా తాత కూడా ఇబ్బందిపడకూడదని… సక్రమంగా పెన్షన్‌దారులకు పెన్షన్ డబ్బులు చేరాలని ఎన్నికల కమిషన్‌కు మా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖ చూసైనా జగన్ రెడ్డి నోటి మీద వేలు వేసుకోవాలి.

జగన్ రెడ్డి మాటలు విని పెన్షన్లు సరిగా అందకుండా కుట్ర చేస్తారేమో! గడప గడపకు వెళ్ళి అవ్వా తాతలకు పెన్షన్లు అందజేసేలా ప్రత్యమ్నాయ మార్గాలు చూడాలని సీఎస్‌కు కూడా లేఖ రాశారు. కానీ తప్పుడు కూతలతో వైసీపీ విర్రవీగిపోతోంది. 1వ తేది నుంచి 5 తేది వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పెన్షన్ సజావుగా అందేటట్లుగా చూడవలసిన బాధ్యత సీఎస్ జవహర్ రెడ్డిదే” అని హెచ్చరించారు.

చెత్త రాజకీయాలు చేస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డికి ధైర్యముంటే ఈసీకి లేఖ రాయాలి…
“ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చే విధానంలో పొరపాటుందని చీఫ్ ఎన్నికల కమిషన్ గమనించి వాలంటీర్లను నిషేధిస్తే కార్టూన్ చిత్రాలతో మా అధినాయకులపై కారుకూతలతో ప్రచారాలు చేస్తున్నారు. అలా చేయడానికి సిగ్గు ఉందా ఎందుకూ పనికి రాని భార్గవ్ రెడ్డి? ఇలాంటి చెత్త లక్షణాలు సజ్జల భార్గవ్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, జగన్ రెడ్డికి మాత్రమే ఉంటాయి. ధైర్యముంటే ఎన్నికల కమిషన్‌ను అడుగు. మా వాలంటీర్లుంటేనే మేము గెలుస్తాము..వాళ్ళే పెన్షన్ పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశుకో” అని సవాల్ చేశారు.

“వైసీపీ ప్రభుత్వం తప్పుడు మార్గాల్లో ఓటర్లను ప్రభావితం చేద్దామని శ్రీ కాళహస్తిలో పెద్ద ఎత్తున డంప్ చేసిన మెటీరియల్‌ను మా కార్యకర్తలు పట్టుకున్నారు. పట్టుబడ్డ డంప్ కేసులో తిరుపతి జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలతో బయట పడాలని వైసీపీ నాయకులు చూస్తున్నారు. ఎవ్వరిని మేము బయట పడనివ్వము. ఆ సామాన్లు నావి అని చెవిరెడ్డ చెప్పానా అతనిపై కేసు పెట్టనివవ్వలేదు. కేసు నుంచి అధికార పార్టీ నాయకులను తప్పించాలని కలెక్టర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని వదిలేది లేదు.

నిన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను ప్రభావితం చేసేందుకు చీరలను డంప్ చేశాడు. చీరలు ఏమైనా రాత్రి పూట కట్టుకుంటాడేమో! ఇవన్నీ అవినీతి పద్ధతులే. ఇటువంటి అవినీతి పద్ధతులతో గెలవాలని చూసినా… కమిషన్ ఆదేశాలను అనుసరించకపోయినా పార్టీ గుర్తింపును రద్దు చేసే హక్కు కూడా ఎన్నికల కమిషన్‌కు మెమో నెం. 437/6/INST/ECI/FUNCT/MCC/2024(campaign) 12వ పారా మరియు 16A కల్పించాయి. వైకాపా అవినీతి పద్ధతులన్నిటిపై ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు త్వరలో ఫిర్యాదు చేస్తాం. అప్పుడు తిరుపతి కలెక్టర్ కాదు కదా ఎవరూ కూడా వైసీపీని కాపాడలేరు. ఇప్పటికీ మించి పోయింది లేదు…. ఇప్పటికైనా శ్రీ కాళహస్తిలో దొరికిన డంప్ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి చెవిరెడ్డిపై కేసు నమోదు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌కు సూచిస్తున్నాం” అని తెలిపారు.

జగన్ రెడ్డి దగ్గర వాలంటీర్ల బానిసత్వానికి తెదెపా వ్యతిరేకం
“వాలంటీర్ వ్యవస్థకు మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మీరు గుడ్డిగా జగన్ పార్టీని భుజానా మోయడానికే మేము వ్యతిరేకం. వాలంటీర్లను గౌరవంలేకుండా బానీసలుగా, కూలీలుగా, జగన్ రెడ్డి వాడుకుంటున్నాడని వాలంటీర్లు గుర్తించాలి. వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లాగా జగన్ రెడ్డి వాడుకుంటున్నాడు. వాలంటీర్లను మెరుగైన రీతిలో మేము వాడుకుంటాం. వారికి గౌరప్రదమైన జీతం, విధి విధానాలు అప్పగిస్తం.

జగన్ రెడ్డి అడుగులో అడుగులేస్తున్న 441 వాలంటీర్లపై క్రిమినల్ కేసులు పెట్టమని ఈసీని కోరాం. వాటని పరిగణలోకి తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు పెడితే మీ భవిష్యత్తే నాశనమవుతది. జగన్ రెడ్డి అడుగులో అడుగు వేస్తే మీరే మునిగిపోతారు. వాలంటీర్లు దగ్గరున్న ట్యాబ్‌లు, సెల్ ఫోన్‌లు అధికారులకు అప్పగించాలి. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు, సెర్ప్ సీఈవో, అధికారులు వాలంటీర్ల దగ్గరున్న వస్తువులను సీజ్ చేయాలి” అని డిమాండ్ చేశారు.

 

 

 

Leave a Reply