Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో జగన్ మతతత్వపాలన

– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

విజయవాడ: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో మతతత్వ పాలన కొనసాగుతోందని, గనులన్నీ దోచుకుంటున్నారని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో బాధితుడయిన తమ పార్టీ అధ్యక్షుడిపైనే కేసులు పెట్టిన పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మసీదు నిర్మాణానికి అనుమతి లేదన్న ఎస్పీ.. మరి మసీదు నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యేపై ఎందుకు కేసుపెట్టలేదని ప్రశ్నించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు ఏమన్నారంటే…

ఆత్మకూరు సంఘటనలో ప్రభుత్వం ముద్దాయి. ఆత్మకూరు ఘటనలో పోలీసులపై కూడా దాడి జరిగింది వాస్తవం కాదా? జిల్లా బీజేపీ అధ్యక్షుని వాహనం దగ్దం చేసి, అతనిని చంపేస్తామని హెచ్చరించారు.ఒరేయ్ శ్రీకాంత్ రెడ్డి నిన్న చంపేస్తాం అంటూ బెదిరించిన ఆడియో కూడా ఉంది.డీఎస్పీ కబురు పెడితేనే శ్రీకాంత్ రెడ్డి కారులో అక్కడకు వెళ్లాడు. అదే కారులో ప్రెస్ రిపోర్టర్లు కూడా ఉన్నారు. జిల్లా ఎస్పీ, డీజీపీ లు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. పక్కా ఆధారాలు ఉన్నా శ్రీకాంత్ రెడ్డి పై ఎఫ్.ఐ.ఆర్ ఎలా నమోదు చేశారు?

తప్పుడు ఫిర్యాదులు ఇస్తే విచారించకుండా జైళ్లకు పంపిస్తారా? వైసీపీకి 151 స్థానాలు ఇచ్చింది అరాచక పాలన చేయమనా? ఏపీలో మతతత్వ ప్రభుత్వం సాగుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా పోలీసులపైనే కేసు పెట్టాలని డిమాండ్ చేస్తారా? అంజాద్ భాష, మరికొంతమంది కలిసి అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టారు.

శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నేతలపై పెట్టిన కేసులు ఉప సంహరించుకోవాలి. ఎటువంటి అనుమతి లేకుండా మసీదు ఎలా కడతారు? ఒక మతానికి కొమ్ము కాసేలా ఉన్న వైసీపీ వైఖరిని వ్యతిరేకిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే అండతో 40 గంటల్లో మసీదు నిర్మాణం చేశారు. ఈ ఘర్షణకు కారణమైన ముస్లీంలు, ఎమ్మెల్యే పైనా కేసులు పెట్టాలి. ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇస్తే మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారు. ఇప్పుడ యినా వైసీపీ తీరు మార్చుకోకపోతే.. తాడోపేడో తేల్చుకుంటాం.

సినిమా టిక్కెట్ల వివాదంలో ప్రభుత్వం తీరుపై ఫైర్
సినిమా టిక్కెట్ల అంశంలో ప్రభుత్వం ఆలోచన ఏమిటి? ఇసుక ధరలు ఎందుకు తగ్గించరు. ప్రజలకు అవసరం లేదా ఇది? సినిమా టిక్కెట్ ధరలు ఒక్కటి తగ్గించి గొప్పగా చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. మీ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బస్తా ధరలు తగ్గించవచ్చు కదా? ధాన్యం కొనేవాళ్లులేక రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టదు. జగన్ కు దమ్ముంటే… 1400కి ధాన్యం కొనుగోలు చేసి చూపించు. నిత్యావసర వస్తువలు, ఇసుక, సిమెంట్ ధరలు కూడా తగ్గించు.ఇవన్నీ ప్రజలకు అవసరం లేనివిగా భావిస్తున్నారా? మీ చేతిలో ఉన్న వాటి ధరలు గురించి మాత్రం మాట్లాడరా? రెండు కోట్ల మంది ప్రజల గురించి జగన్ ఆలోచించరు. వేల మంది చూసే సినిమా టిక్కెట్లు తగ్గించి గొప్ప పని చేసినట్లు ప్రగల్భాలు. కనీసం సిగ్గు లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు.

గతంలో చంద్రబాబు, నేడు జగన్ లు ప్రజలను మోసం చేశారు. ఏపీ ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేసే ఏకైక పార్టీ బీజేపీనే. గనులను జాతీయం చేస్తే ఏపీ ప్రభుత్వానికి అసలు అప్పులు చేయాల్సిన అసరమే ఉండదు. వైయస్ తండ్రి హయాం నుంచి నేటి వరకు గనులను దోచుకుని కోట్లు కూడేసుకున్నారు. ఎయిడెడ్ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు యత్నించారు.మంత్రి గారూ.. రాంగోపాల్ వర్మ ను పిలిచి బోజనం పెట్టారు. విద్యార్థుల కడుపు నింపే విషయాన్ని మాత్రం పట్టించుకోరు.

బీజేపీని ఓడించినా.. రాష్ట్రం మొత్తం 24 గంటలూ కరెంటును ఇచ్చాం. పౌరసరఫరాల శాఖలో బియ్యం రవాణా అతి పెద్ద కుంభకోణం. గత ప్రభుత్వంలో ఓ మంత్రి ఈ డబ్బుతో ఒక ఇల్లే నిర్మించాడు. అధికారులు కుర్చీలకు అతుక్కుపోయి దోచుకుంటున్నారు. వైసీపీ నేతలే బియ్యం అక్రమ రావాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి అక్రమాలను త్వరలోనే బీజేపీ బయట పెడుతుంది. పరిపాలన అంటే ప్రజల సౌభాగ్యాన్ని కోరే విధంగా సాగాలి.

ఆత్మకూరు ఘటనలో ప్రధాన ముద్దాయిలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులే. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ప్రధాన ముద్దాయి. మా పార్లమెంట్ అధ్యక్షుడి వాహనాన్ని పోలీసు స్టేషన్ లో నే దగ్దం చేసి ఆయన పైన హత్యా ప్రయత్నం చేశారు. శ్రీకాంత్ రెడ్డి ని చంపేస్తున్నామని మా కార్యకర్తలను బెదిరించారు.మా వద్ద రికార్డ్స్ ఉన్నాయి. ఆత్మకూరు పోలీసులు 150 మంది వచ్చారని అంటుంటే డిజిపి 50 మందే వచ్చారనడం హాస్యాస్పదం. పోలీసులే రక్షించి మళ్లీ అతని పైనే 307 ఎలా కడతారు ? పోలీసువ్యవస్ధను నిర్వీర్యం చేయొద్దు..ఆత్మకూరు లో 144 సెక్షన్ ఎత్తివేయాలి. అంజాద్ భాషా, ఎమ్మెల్యేలు 144 సెక్షన్ ఉండగా వెళ్లారు. వారిపైన కేసులు పెట్టకపోతే మేం ఆత్మకూరు వస్తాం. హిందువుల మధ్య మసీదు ఎలా‌ కడతారు. మసీదు నిర్మాణానికి అనుమతులు లేవని ఎస్ పి చెప్పారు. మరి ఎమ్మెల్యే ఎలా మద్ధతిస్తారు?

మేం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తాం.రవాణా చార్జీలు మాత్రమే వసూలు చేస్తాం..ప్రభుత్వానికి చాలా డబ్బు వస్తుంది.సిమెంట్ 220 రూపాయలకే ఇస్తాం.మీరెందుకు తగ్గించరు? మేం అధికారంలోకి వస్తే 1400 రూపాయలకు ధాన్యం కొని 40 రూపాయలకే ఇస్తాం.రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. బంగారం మాదిరి ఇసుక అన్ని చోట్లా ఎందుకు అమ్మరు? రాష్ట్రంలో గనులు ఆక్రమించుకోవడం పరిపాటిగా‌ మారిపోయింది. గనులు, గ్రానైట్ లన్నీ ఆంధ్రప్రదేశ్ జాతికి ఇస్తాం..జాతికి ఇవ్వకుండా గత, ప్రస్తుత ప్రభుత్వాలు దోచేసుకుంటుంటేనే అప్పుల పాలవుతున్నాం. వైఎస్, ఆయన తండ్రి గనులను తవ్వేశారు.
పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర వెంకట శివన్నారాయణ, బిజెపి నేత లక్ష్మీ పతిరాజా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE