– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఆర్థిక ఉగ్రవాది జగన్ పాలకుడు కావడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం రాజ్యమేలుతోంది. క్రిమినల్-ఆర్థిక నేరాల్లో ఆరితేరిన గజదొంగ జగన్ ముఖ్యమంత్రి కావడంతో కొంతమంది పోలీసులూ దొంగలు, స్మగ్లర్లు, కిడ్నాపర్లుగా మారుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం జగన్ ఖాకీలను ప్రైవేటు ఫ్యాక్షన్ సైన్యాలుగా వాడటంతో వారికీ నేరాలు అలవాటైపోయాయి.
సీఐడీని కిడ్నాప్‌లు, బెదిరింపులకి పాలకులే వినియోగిస్తుండడంతో తాము ఏం చేసినా అడిగేవారు లేరని పోలీసులు ముఠాలుగా ఏర్పడి స్మగ్లింగ్, కిడ్నాపులకు పాల్పడడం పోలీసు వ్యవస్థ గౌరవాన్ని మంటగలిపింది. కర్నూల్ డీఐజీ ఆఫీసులో ఎస్సైగా పని చేస్తున్న సుజన్ ఓ ముఠాని ఏర్పాటుచేసి ఏపీ సీఐడీ బృందం పేరుతో ఐటీ కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ పోలీసులకి చిక్కిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.
గంజాయి మాఫియాకి ఏపీ సర్కారు పెద్దల అండదండలున్నాయని తెలిసిన పోలీసులు గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారు. 22 కిలోల గంజాయితో కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ హైదరాబాద్ పోలీసులకు చిక్కడం ఏపీలో పోలీసులే గంజాయి స్మగ్లర్లుగా మారిన దుస్థితిని వెల్లడిస్తోంది.