Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్లకు జగన్ సర్కార్ షాక్

– వాలంటీర్లకు ఎన్నికల విధులొద్దు
– పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండవద్దు
– జగన్ సర్కారు కీలక నిర్ణయం
– ఉత్తర్వు జారీ చేసిన ప్రభుత్వం
– వాలంటీర్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

అమరావతి: వైసీపీ సర్కారు-పార్టీకి జమిలి గుండెకాయ లాంటి వాలంటీర్లు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆమేరకు హైకోర్టు ఆదేశాలను జగన్ సర్కారు విధిలేక అమలుచేయాల్సి వచ్చింది. దానితో ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలు వాడుకుని అధికారంలోకి వద్దామన్న వైసీపీ ఆశలు హైకోర్టు ఆదేశాలతో ఆవిరయ్యాయి.

వాలంటీర్లను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికలతో ముడిపడిన ఏ ప్రక్రియలోనూ వారిని పాల్గొననివ్వవద్దని పేర్కొంది. పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండేందుకు వారు అనర్హులని తెలిపింది. కాగా ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A RESPONSE