Suryaa.co.in

Andhra Pradesh

తారకరామ తీర్థ సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయండి

– యువనేతకు ఆత్మారాముని అగ్రహారం గ్రామ ప్రజల విన్నపం

నెల్లిమర్ల: రామతీర్థసాగర్ నిర్వాసిత ప్రాంతంగా ఉన్న తమ గ్రామానికి పునరావాస ప్యాకేజి అందించి ఆదుకోవాలని నెల్లిమర్ల నియోజకవర్గం ఆత్మారాముని అగ్రహారం గ్రామస్తులు యువనేత లోకేష్ కు విన్నవించారు. రామతీర్థంలో శంఖారావం సభకు ముందు ఎ.అగ్రహారం ప్రజలు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కూడా ప్రకటించారు.

గ్రామ ప్రజల అంగీకారంతో 648మందిని పిడిఎఫ్ సభ్యులకు 6,75,00 చొప్పున అప్పట్లో మంజూరు చేశారు. గ్రామం పక్కనే ఉన్న కుమిలి రెవిన్యూ పరిధిలోని కొండపక్కన 50ఎకరాల భూమిని కూడా కేటాయించారు. అయితే 2019లో వైసిపి ప్రభుత్వం వచ్చాక మా గ్రామాన్ని పక్కనబెట్టారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ నిధులు గానీ, పునరావాస కార్యక్రమాలు గానీ అమలు చేయలేదు. గ్రామాన్ని ముంపు గ్రామంగా చూపించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. గ్రామం చుట్టూ పెద్దపెద్ద గోతులు తవ్వడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం.

భూములు రిజర్వాయర్లో పోవడంతో కనీసం కూలీపనులు దొరక్క వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మీరు అధికారంలోకి రాగానే ప్రతి పిడిఎఫ్ సభ్యుడికి గతంలో ప్రకటించిన విధంగా పరిహారాన్ని అందించాల్సిందిగా కోరారు. యువనేత లోకేష్ స్పందిస్తూ… రెండునెలల్లో టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ప్రకటించిన విధంగా ఆత్మారాముని అగ్రహారం గ్రామస్తులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE