– ఇంత అహంకారం వచ్చిందా ?
– నాశనం అయ్యే ముందు గర్వం వస్తుంది
– టీడీపీ ని ఈయనే గెలిపించాడంట
– పవన్ కోసం వర్మ పిఠాపురంలో ఎంత కష్టపడ్డాడో తెలియదా?
– బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా?
– ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా?
– పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ .. రోజుకో మాట మార్చే వ్యక్తి
– బాబు పామును పెంచినట్టు దత్తపుత్రుడిని పెంచుతున్నారు
– ఇప్పుడు ఆ పాము పెంచినవాళ్లనే మింగే స్థాయికి ఎదిగింది
– డిప్యూటీ సీఎం పవన్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్
అమరావతి: నలభైఏళ్ల చరిత్రగల టీడీపీని తానే నిలబెట్టానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురంలో పవన్ విజయం తమ వల్లే అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ ఆయన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ నాయకత్వం .. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోణంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అసాధారణ సంయమనం పాటిస్తోంది. అయితే పసుపు దళాలు, సోషల్‌మీడియా సైనికులు మాత్రం సోషల్‌మీడియా వేదికగా మెదగా బ్రదర్స్‌ను రఫ్ఫాడించేస్తున్నాయి.
ఈ క్రమంలో తెరపైకొచ్చిన ప్రజాశాంతి అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రచారకుడైన కేఏ పాల్.. జనసేన ఫ్యామిలీపై నిప్పులు కురిపించడం చర్చనీయాంశమయింది. పవన్‌ను సీఎం చంద్రబాబు పాముకు పోలు పోసి పెంచుతుంటే, చివరకు ఆ పామే పెంచినవాళ్లను మింగేసే పరిస్థితికి చేరిందంటూ తీవ్రమైన కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు హిందుత్వ, నాసిక్తంపై పవన్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు సనాతనధర్మం పేరుతో చేసుకుంటున్న ప్రచారాన్ని గుర్తు చేశారు.
” టీడీపీ ని ని ఈయనే గెలిపించాడంట. అరే… బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. 45 శాతం ఓట్లు ఉన్న తెలుగుదేశం పార్టీని ఈయన గెలిపించాడంట. టీడీపీని గెలిపించానని నేనే ఎప్పుడూ చెప్పుకోలేదు. 2014లో 18 మీటింగులు పెట్టి వారికి 5 శాతం ఓట్లేయించాను. నేను చంద్రబాబుకు క్యాంపెయిన్ చేయకపోతే జగన్ సీఎం అయ్యేవాడు. ఇప్పుడు టీడీపీని పవనే గెలిపించాడంట. బీజేపీని కూడా ఈయనే గెలిపించాడంట. ఆయన మాటలు వింటుంటే నాకు సిగ్గేస్తోంది. టీవీ ముందు కూర్చుని పవన్ ప్రసంగం చూస్తున్నప్పుడు ఏంచేయాలో అర్థం కాలేదు. నాశనం అయ్యే ముందు గర్వం వస్తుంది అని బైబిల్ లో ఉందన్న విషయం గుర్తొచ్చింది. ఈయన నాశనం అవడానికే ఇంత గర్వం వచ్చిందా? ఇంత అహంకారం వచ్చిందా అనిపించింది” అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌పై విరుచుకుపడ్డారు. తాజాగా పాల్ నిర్వహించిన ప్రెస్‌మీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
“పవన్ వాళ్ల అన్నయ్య వర్మ పేరెత్తకుండా మీ ఖర్మ అన్నారు. పవన్ కోసం వర్మ పిఠాపురంలో ఎంత కష్టపడ్డాడో తెలియదా? వాళ్ల మాటలు నమ్మి తాను పోటీ చేయకుండా, పవన్ ను లక్ష ఓట్లతో గెలిపించాడు. అలాంటి వ్యక్తిని అవమానిస్తారా? ఎన్నికలు అయిపోయాక మీరే నన్ను గెలిపించారని వర్మతో అన్న పవన్ కల్యాణ్ఇప్పుడు వర్మ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇంత అవినీతా? ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా? పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడారు . పవన్ కల్యాణ్ మాటల్లో స్థిరత్వం లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేద” ని పాల్ విమర్శించారు.
గతంలో పవన్ కల్యాణ్ నాస్తికుడినని చెప్పుకున్నారు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తన తండ్రి రామనామం జపించేవారని పవన్ కల్యాణ్ చెప్పడం కూడా అబద్ధం. గతంలో తన తల్లి దీపం వెలిగిస్తే, తన తండ్రి ఆ దీపంతో సిగరెట్లు వెలిగించుకునేవారని చెప్పారు.
పవన్ కల్యాణ్ పుట్టినప్పుడు నొప్పి లేకుండా పుట్టాడన్న మెగా బ్రదర్ వ్యాఖ్యలను కూడా పాల్ తప్పుబట్టారు. ఒక తల్లి తన బిడ్డను నవమాసాలు మోసి ఎన్నో కష్టాలు పడుతుందని, అలాంటి తల్లిని అవమానించడం సరికాదని హితవు పలికారు. మోదీ పుట్టినప్పుడు కూడా ఇలాగే తల్లికి నొప్పులు లేకుండానే పుట్టాడని ప్రచారం చేశార ని పాల్ మండిపడ్డారు.
హిందీ భాష మనకు వద్దని, మాతృభాషల్లో చిచ్చు పెట్టొద్దని గతంలో అన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు హిందీ భాష కావాలని మాట్లాడటం, ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని, తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషను కాదని హిందీ భాషను ప్రోత్సహించడం సరికాదు.
చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చడం సరికాదని పాల్ విమర్శించారు. పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని, రోజుకో మాట మార్చే వ్యక్తి. అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు పామును పెంచినట్టు దత్తపుత్రుడిని పెంచుతున్నారు.
ఇప్పుడు ఆ పాము పెంచినవాళ్లనే మింగే స్థాయికి ఎదిగింది. జగన్ మోహన్ రెడ్డి తనను కలిస్తే ఏడు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తా. రాష్ట్రాభివృద్ధికి పాటుపడతా. క్షమాపణ అడిగిన వారిని యేసు ప్రభువు క్షమిస్తారు. తప్పు చేసినప్పుడు పవన్ కల్యాణ్ క్షమాపణ అడగాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని పవన్‌కు పాల్ సూచించారు.