– పల్నాడులో ఖండించిన కుల సంఘాలు
– నరికేస్తాం అంటుంటే ఖండించలేదు
– దుమ్మెత్తిపోసిన గుమ్మడి రామకృష్ణ
విజయవాడ: మాసీ సీఎం జగన్ మా వేళ్ళతో మమ్మల్నే పొడుస్తున్నారు.. మీరు రాజకీయాలు మాట్లాడండి. కులాల పేరు వద్దు. మీరు ఏబీవీ, నిమ్మగడ్డ రమేష్ లను వేధించారు. మీ వల్లే మల్లేశ్వరరావు చనిపోయారు. 175 అని చెప్పి ప్రోత్సహించారు.. ఓదార్పు యాత్రలో నరికేస్తాం అంటుంటే ఖండించలేదని కమ్మ సేవా సమితి విజయవాడ ఉపాధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు.
అసెంబ్లీలో భువనేశ్వరిని అవమానిస్తే నవ్వుకోవడం దేనికి సంకేతం? మతాలు, కులాలు వద్దు విధానాలు మాట్లాడండి. మేం టీడీపీ కి దాసోహం కాదు. 1971 నుంచి 13 మంది సీఎంలను చూశాం.. ఎవరు కులాల మీద టార్గెట్ చేయలేదు.. మాట్లాడలేదు. మీరు ఏ కుల ప్రస్తావన తీసుకు రావద్దు.. అసెంబ్లీ నుంచి పారిపోయి ఓదార్పు పేరుతో కుట్రలు, విద్వేషాలు రెచ్చకొట్టొద్దని రామకృష్ణ హితవు పలికారు.
ఆ సంఘం అధికారి ప్రతినిధి పువాడ సుధాకర్ మాట్లాడుతూ సమాజంలో కులాల ప్రస్తావన తెచ్చే విధంగా మాట్లాడవద్దు. నీ పాలనలో కమ్మ వారిపట్ల ద్వేషంతో అమరావతికి కులాన్ని అపాదించారు.. డీఎస్పీ ట్రాన్స్ఫర్ లను కులానికి ఆపాదించారు. కమ్మ కులస్తులు ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తే కులాన్ని అపాదిస్తావ్.. అనేక మంది రెడ్డి సీఎంలు పని చేశారు.. ఎవరు మాట్లాడనివి నువ్వు మాట్లాడావు.. కులాన్ని పార్టీలతో ముడి పెట్టవద్దు. సమాజ సేవకు కమ్మ కులం కట్టుపడి ఉంది. మా కులాన్ని అగౌరవ పర్చవద్దు. మీ పాలనలో కమ్మ అధికారులను తొక్కి పెట్టావ్ ..
కమ్మ కులంపై ఏ రాజకీయ పార్టీ విమర్శలు చేసినా సహించేది లేదని సుధాకర్ హెచ్చరించారు. కులాల మధ్య సామరస్యం కోసం పని చేయాలి.. కులాల మధ్య అంతర్గత చిచ్చు పెట్టీ మీరు ఆనందించడం సరికాదు.. మా కులాన్ని ద్వేషించే రాజకీయ పార్టీలకు మేం వ్యతిరేకంగా పని చేస్తామన్నారు.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) ఏపీ ప్రతినిధి ముత్తవరపు.రామకృష్ణ మాట్లాడుతూ, మీ పార్టీలో కమ్మవారికి ప్రాధాన్యత ఇచ్చారా? స్వాతంత్రం తర్వాత కమ్మ మంత్రి లేకుండా మీ ప్రభుత్వంలో హయంలో జరిగింది. మీ పార్టీ లో ఉన్న దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ లకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు. అవన్నీ మాట్లాడకుండా కులాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోండి. విలేఖర్ల సమావేశంలో ఏపీకేఎస్‌ఎస్ మహిళా సెక్రటరీ స్వరూప రాణి, సూరపనేని, నాయకులు నాదెండ్ల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.