-గోషామహల్ కార్యకర్తలను వెంటనే వదిలేయాలి
-లేకుంటే డీజీపీ, టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు వచ్చేదాకా చేయొద్దు
-డేట్, టైం ఫిక్స్ చేయ్…. ఏ పార్టీ బలమెంతో తేల్చుకుందాం
-కాషాయ దళం బలమెంతో నిరూపిస్తాం…
-చచ్చే వరకు హిందువుగానే బతుకుతా
-నక్సలైట్లతో ఎధురొడ్డిన పార్టీ బీజేపీ
-మీ అరెస్టులకు, పీడీయాక్ట్ లకు భయపడే ప్రసక్తే లేదు
-రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
– మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం
– 4 శాతం రిజర్వేషన్లవల్ల హిందువులు గెలవాల్సిన చోట 26 మంది ఎంఐఎం కార్పొరేటర్లు గెలిచారు.
-చిలుకానగర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫైర్
-పలువురు నేతలు బండి సమక్షంలో బీజేపీలో చేరిక
గోషామహల్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా తీసుకెళ్లడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘కేసీఆర్… టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపి గోషామహల్ లోని బీజేపీ కార్యకర్తలను తీసుకుపోయి టార్చర్ పెడతారా? నా కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్… తక్షణమే వాళ్లను బేషరతుగా విడుదల చేయాలి. లేకుంటే డీజీపీ, టాస్క్ ఫోర్స్ కార్యాలయాల వద్దకు వచ్చి కూర్చుంటా’’ అంటూ హెచ్చరించారు. కేసీఆర్ కు దమ్ముంటే ఎవరి బలమెంతో తేల్చుకుందామని…. డేట్, టైం ఫిక్స్ చేస్తే బల ప్రదర్శనకు సిద్ధమని సవాల్ విసిరారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న బండి సంజయ్ చిలుకానగర్ చౌరస్తా వద్ద భారీ ఎత్తున హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అందులో ముఖ్యాంశాలు…
పాదయాత్ర నేటితో ఎనిమిదవ రోజుకు చేరుకుంది. ఉప్పల్ రాగానే వర్షం స్టార్ట్ అయింది.. మోకాళ్ళ లోతు నీళ్లు వస్తున్నాయి. ఎక్కడా రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. కెసిఆర్ బిడ్డపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఖాసిం చంద్రశేఖర రజ్వి పాస్పోర్టుల బ్రోకర్. సాయం చేసిన వాళ్లను కేసీఆర్ పట్టించుకోడు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోడు. ఉప్పల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని, అభివృద్ధి చేస్తానన్న నాయకుల హామీ ఏమైంది? తెలంగాణ సెంటిమెంటును రగిలించి, పొట్టుపొట్టు ఓట్లు వేయించుకున్న కవిత, కేటీఆర్ ఎక్కడికి పోయారు?. లిక్కర్ స్కాం, డ్రగ్స్, ఇసుక, పత్తాలు… ఇలా ఏ స్కామ్ చూసినా… కెసిఆర్ కొడుకు ktr, కూతురు కవిత పేర్లే…. ఉచితంగా నీళ్లు ఇస్తానన్న కేసీఆర్, కుటుంబం నుంచి 500 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఉప్పల్ కారిడార్ కోసం కేంద్రం 600 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని పూర్తి చేయడం లేదుఉప్పల్ టెర్మినల్ నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పటివరకు దాన్ని కూడా పూర్తి చేయలేదు. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారి మళ్ళిస్తున్నాడు .
ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా భజన పరులుగా మారి, కేసీఆర్ ను జోకుతున్నారi. కేసీఆర్ ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అభినవ అంబేద్కర్ అని అంటూ… అంబేద్కర్ ను అవమానిస్తున్నాడు. కెసిఆర్ ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు అంటూ డ్రామాలు చేస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయకుండా ఆపిందెవరు?. పోడి భూముల సమస్య కోసం కొట్లాడిన గర్భవతిని, రోడ్డు మీద ఈడ్చుకెళ్లి జైల్లో పెట్టిన మూర్ఖుడు కేసీఆర్.
మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం. ముస్లిం లకు 4% రిజర్వేషన్లు ఇస్తే… జిహెచ్ఎంసిలో 26 మంది బీసీలు గెలవాల్సిన చోట, ముస్లింలు గెలిచారు. ఎంఐఎం పార్టీకి కొమ్ముకాసే టిఆర్ఎస్ పార్టీ సంగతి చూసేందుకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో 4 స్థానాల నుంచి 48 స్థానాల్లో బిజెపి గెలిచింది. భాగ్యనగరంలో హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే… ఎలాంటి చరిత్ర సృష్టిస్తామో మీరే ఆలోచించండి. టిఆర్ఎస్ పార్టీకి, బిజెపికి కేవలం 6000 ఓట్లు మాత్రమే తేడా.
బండి సంజయ్ చచ్చే వరకు హిందువుగానే బతుకుతాడు. హిందూ హిందువుగానే జన్మించాలి. హిందువుగానే మరణించాలr. బీహార్ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలంగాణ యువత ఒకసారి ఆలోచించాలr. ఎంఐఎం పార్టీ బీహార్ లో ఐదు సీట్లు గెలిచిందr. మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంఐఎం అధికారంలో లేదు.. అక్కడి ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అయినా కూడా అక్కడ సీట్లు గెలుచుకుంది. 10 శాతం ఉన్న బీహార్లో ముస్లింలు సంఘటితమై ఐదు సీట్లు గెలిచారు. అలాంటిది 80% ఉన్న తెలంగాణలో హిందువులంతా సంఘటితమైతే… ఎన్ని సీట్లు సాధిస్తామో మీరే ఆలోచించాలి. కులాలు, వర్గాలు, వర్ణాలు సంఘాల పేరుతో కెసిఆర్ ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాడుకేసీఆర్ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మునావర్ ఫారుఖీ అనే కమెడియన్ ని తీసుకొచ్చి, పోలీస్ బందోబస్తు నడుమ ఇక్కడ షో చేయించారు.
బిజెపి కార్యకర్తలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి, దాడి చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను హెచ్చరిస్తున్నా.. గోషామహల్ లోని మా బీజేపీ కార్యకర్తలు హరీష్ ఓజా, అర్జున్ యాదవ్ లను వెంటనే విడుదల చేయండి. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనే టాస్క్ ఫోర్స్ కార్యాలయం ముట్టడికి వస్తా. పోలీసులకు బెనిఫిట్స్, ప్రమోషన్లు ఇవ్వకుండా… మమ్మల్ని కెసిఆర్ కొట్టిస్తున్నాడు. వెంటిలేటర్ పై ఉన్న పార్టీ టిఆర్ఎస్. బిజెపి కార్యకర్తలను బేషరతుగా వెంటనే విడుదల చేయండి. కెసిఆర్ తో బల ప్రదర్శనకు, కొట్లాడడానికి నేను సిద్ధం. డేట్ & టైం వాళ్లే ప్రకటించాలి. చత్రపతి శివాజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ వారసులుగా మేము వస్తాం. ఖాసిం చంద్రశేఖర్ రజ్వి నువ్వు నీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీతో కలిసి రా.
బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు, పీడీ యాక్టులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా… బిజెపి కార్యకర్తలు భయపడరు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. 50 శాతం మంది బిజెపి కార్యకర్తలు ఆల్రెడీ జైలుకుపోయి వచ్చిన వాళ్లే. రేప్ కేసులలోనో… ల్యాండ్ స్కామ్లలోనో… టిఆర్ఎస్ కార్యకర్తల్లా మా కార్యకర్తలు జైలులకు పోయి రాలేదు. దేశం కోసం జైలుకు వెళ్లి వచ్చారు. నమ్మిన సిద్ధాంతం కోసం జితేందర్ అన్న నక్సలైట్లకు ప్రాణాలర్పించారు. పేదల కోసం పనిచేసేదే బిజెపి.
1400 మంది అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. శ్రీలంకలో ఒక కుటుంబం రాజ్యమేలి చిప్ప చేతికిచ్చింది. తెలంగాణలో కూడా ఒక్క కుటుంబమే రాజ్యమేలుతోంది. ప్రతి ఒక్కరిపై 1,20,000 అప్పు పెట్టిండు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రజల చేతికి చిప్పనిచ్చిండు. ప్రజలు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి కల్పించిండు. ఎన్నికల సమయంలో మీరంతా కలిసికట్టుగా పనిచేసి, బిజెపి కి ఓటు వేయించండి.
పోలీసు కేసులు పెట్టినా… లాఠీ ఛార్జ్ చేసినా… భయపడకండి. ల్యాండ్ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాడితే ఇక్కడ మా నలుగురు కార్యకర్తలపై కేసులు పెట్టారు. కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ పార్టీలకు ఓటు వేశారు. బిజెపి కి ఓటు వేయకపోయినా… ఉప్పల్ ప్రాంతానికి కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ప్రజాస్వామ్య నిర్మాణం కోసం బిజెపిని గెలిపించండి. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బిజెపి రావాల్సిందే.