Home » మోదీ గారు..మాది ముమ్మాటికీ తెలంగాణ టీమ్

మోదీ గారు..మాది ముమ్మాటికీ తెలంగాణ టీమ్

-బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి
– ప్రధాని మోదీపై కేటీఆర్ ట్వీట్ పంచ్

ప్రధాని మోదీ గారు..
రాహుల్ వచ్చి.. మమ్మల్ని మీ బీ టీమ్ అంటారు. మీరొచ్చి… మేము కాంగ్రెస్ సీ టీమ్ అంటారు.
మేం బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్ కు సీ టీమ్ కాదు..
మాది ముమ్మాటికీ T టీమ్.. తెలంగాణ టీమ్
తెలంగాణ ప్రజల హక్కుల కోసం.. ఎవరితోనైనా.. ఎక్కడి దాకైనా పోరాడే ఏకైక టీమ్
నిన్నటి దాకా మత రాజకీయం చేశారు !! నేడు కుల రాజకీయానికి తెర తీశారా ??
పదేళ్ల మీ హయాంలో.. దేశంలోని బీసీలకు మిగిలింది వేదన… అరణ్య రోదనే
కనీసం బీసీల జనగణన కూడా చేయని పాలన మీది..
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టని ప్రభుత్వం మీది..
అందుకే బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీయే
బీసీలంటే మీ దృష్టిలో బలహీనవర్గాలు కానీ.. మాకు బీసీలంటే.. బలమైన వర్గాలు
రాష్ట్రంలోని బీసీలకు పదవులే కాదు.. అనేక పథకాలిచ్చిన ప్రభుత్వం మాది
టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిందే మీ బీజేపీ నేతలు నిందితులతో వేదిక పంచుకుని.. మాపై నిందలా ??
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్ నే మించిపోయింది.. మీ బీజేపీ ప్రభుత్వం
ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని మీరు.. రెండుసార్లు సంకల్పించిన మా సర్కారుపై విమర్శలు చేయడం నిజంగా విడ్డూరం..
బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి

జై తెలంగాణ
జై బీఆర్ఎస్
జై కేసిఆర్

Leave a Reply