-బీసీలను కుక్కల కంటే హీనంగా కేసీఆర్ చూస్తున్నారు
-50 శాతం జనాభా ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులా?
-కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులిస్తారా?
-జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీలను అవమానించిన మూర్ఖుడు కేసీఆర్
-బీసీ బంధు ఇవ్వడానికి కేసీఆర్ కు ఉన్న అభ్యంతరం ఏమిటి?
-లక్షల మందితో జూన్ లో హైదరాబాద్ లో బీసీ గర్జనతో సత్తా చాటండి
-ఓబీసీ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు
తెలంగాణలో భజరంగ్ దళ్ పై నిషేధం విధించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ తో కేసీఆర్ పోటీ పడుతున్నారని అన్నారు. అదే జరిగితే భారత మాతా కీ జై అంటే జైల్లో వేస్తారని, జై శ్రీరాం అంటే కేసులు పెట్టి వేధించే రోజులు రాబోతున్నాయని అన్నారు. ఈరోజు నాగోల్ లో జరిగిన ఓబీసీ సమ్మేళనంలో బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….
ఓబీసీ సమ్మేళనం ఎవరికీ వ్యతిరేకం కాదు… కేసీఆర్ కుటుంబానికి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. కేసీఆర్ ను ఆ కులపోళ్లు కూడా అవమానిస్తున్నరు. బీసీలను అడగడుగునా అవమానిస్తున్నరు.అగ్రవర్ణ పేదలకు మోదీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే రెండేళ్లపాటు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకున్న మూర్ఖుడు కేసీఆర్.
బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి మోదీ. 27 మందికి కేబినెట్ లో చోటు కల్పించారు. సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా, లక్ష్మణ్ ను రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్ బోర్డు సభ్యుడిగా నియమించిన పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో బీసీలను అడుగడుగునా అవమానించిన వ్యక్తి కేసీఆర్. ఆయనకు తెలంగాణ పాఠాలు నేర్పిన ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గూడ అంజన్నలను దారుణంగా అవమానించిన మూర్ఖుడు కేసీఆర్.
తెలంగాణ జనాభాలో 50 శాతమున్న బీసీలకు కేసీఆర్ చేసిందేమిటి? గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి రాజకీయంగా అణగదొక్కుతున్నారు. 50 శాతం బీసీ జనాభాఉంటే ముగ్గురికి మాత్రమే కేబినెట్ లో చోటు కల్పించి మోసం చేసిన మూర్ఖుడు కేసీఆర్. ఒక్కసారి ఆలోచించండి. బీసీ వ్యక్తిని బీజేపీ ప్రధానిని చేసింది. మోదీ కేబినెట్ లో 27 మందికి చోటు కల్పిస్తే… కేసీఆర్ చేసిందేమిటి? దీనిపై నిలదీయండి… మోదీ పేద కుటుంబం నుండి వచ్చారు కాబట్టే పేదలందరికీ దేశంలో పీఎం అవాస్ యోజన కింద ఇండ్లు కట్టిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ మహిళలను కట్టెలపొయ్యి బాధ నుండి ఆదుకున్నారు. ఇంటింటికీ టాయిలెట్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. ముద్ర లోన్లు ఇస్తూ, ఉపాధి కల్పిస్తూ బీసీలను ఆదుకుంటున్నారు.
రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ కుల వ్రుత్తులను దెబ్బతీస్తున్నారు. అవసరం లేకపోయినా 16 వందల కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్, ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం… బీసీ ఆత్మగౌరవ భవనాలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో బీసీ సమాజం గుర్తించాలి. కూలీనాలీ చేసుకుని బతకాల్సిన దుస్థితి బీసీలది. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల వల్ల 32 మంది కార్పొరేటర్ పదవుల్లో హిందువులకు అన్యాయం జరిగింది. ఇప్పుడే తెలిసింది. తెలంగాణలో కూడా భజరంగ్ దళ్ ను నిషేధించేందుకు కేసీఆర్ ఫ్రభుత్వం సిద్ధమైందట.. దీనిపై చర్చిస్తుందట…నిషేధిస్తే ఊరుకుందామా? మనం మౌనంగా ఉంటే భారత మాతా కీ జై అంటూ జైల్లో పెడతారు. జై శ్రీరాం అంటే కేసులు పెడతారు.
కర్నాటకలోని పరిస్థితులు వేరు.. తెలంగాణలోని పరిస్థితులు వేరు… భాగ్యలక్ష్మీ వద్దకు వెళ్లే దమ్ము కేసీఆర్ కు లేదు.. ముస్లింల అభివ్రుద్ధి గురించి మాట్లాడిన పార్టీ బీజేపీ. ముస్లిం మహిళల మనోభావాలను కాపాడేందుకు ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసిన పార్టీ బీజేపీ… ట్రిపుల్ తలాఖ్ ను వ్యతిరేకిస్తున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు. పాతబస్తీ ఎందుక అభివ్రుద్ధి కావడం లేదో ముస్లిం ప్రజలంతా కేసీఆర్ పాలకులను నిలదీయాలి. బీజేపీని ముస్లిం వ్యతిరేక బూచిగా చూపిస్తూ లబ్ది పొందాలని చూస్తున్నాయి. పాతబస్తీ వేదికగా ముస్లింకు జరిగిన అన్యాయంపై నేను లెవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పాతబస్తీ ప్రజలు ఇదే విషయంపై నిలదీయాలని కోరుతున్నా.
తెలంగాణలో భజరంగ్ దళ్ పై నిషేధం విధించాలని ఏ ఒక్క ముస్లిం కూడా కోరుకోవడం లేదు. భజరంగ్ దళ్ ఎక్కడా హింసను ప్రేరేపించలేదు. హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తోంది. అయినా భజరంగ్ దళ్ ను నిషేధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ కంటే ముందే నిషేధం విధించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నడు.. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే సత్తా చూపతామని, కేసీఆర్ సంగతి తేలుస్తామని హెచ్చరించారు.
వేల కోట్లు సంపాదిస్తున్న కేసీఆర్ కుటుంబం బీసీలను మాత్రం పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు. బీసీలకు రావాల్సిన వాటా నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదు? దళిత బంధులో 30 శాతం కమీషన్లు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని సాక్షాత్తు సీఎం చెప్పిండు. దళిత సీఎం హామీని విస్మరించిండు.. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని కేసీఆర్ చూస్తున్నడు. బీసీలను కుక్కుల కంటే హీనంగా చూస్తున్నడు… బీసీలకు ఆదుకునేందుకు పైసా ఇవ్వడం లేదు. అందుకే బీసీ బంధు ఇవ్వడానికి సీఎంకు ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలి. ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలి. అందుకే లక్షల మంది బీసీ సమాజంతో భాగ్యనగర్ గడ్డపై బీసీ శంఖారావం పేరుతో బీసీ గర్జన చేస్తాం… తెలంగాణలో పేదల రాజ్యం రావాల్సిందే. అందుకోసం 5 నెలలు పూర్తి సమయం మాకివ్వండి. కేసీఆర్ రాక్షస, కుటుంబ పాలనను అంతం చేస్తాం… పేదల రాజ్యాన్ని తీసుకొస్తాం…