– తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న కొణతం దిలీప్ను విచారణ కోసమని పిలిచి అరెస్టు చేయడం అక్రమం, కక్షపూరితం. అక్రమంగా అరెస్టు చేసిన దిలీప్ ను తక్షణమే విడుదల చేయాలి. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ నయవంచనను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించడం వారి దమననీతికి అద్దం పడుతున్నది. ప్రశ్నించేవారి గొంతులు నొక్కడం ద్వారా ప్రభుత్వం చేసే వంచనను దాచిపెట్టాలనుకోవడం భ్రమ. అధికారంకోసం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గ్రహించినందువల్లే తిరుగుబాటు మొదలైంది. అందుకు లగచర్ల లంబాడి రైతుల తిరుగుబాటు నిదర్శనం.