– మూసీకి నీళ్లు తెస్తానంటున్న రేవంత్ కాళేశ్వరం నీళ్ళే కదా తెచ్చేది?
– కేసీఆర్ తీసుకున్న రకరకాల రైతాంగ అనుకూల విధానాలు సాగు విస్తీర్ణం పెరగడానికి కారణం
మేడిగడ్డ బ్యారేజి ఇంత వర్షాకాలం లోనూ నిలబడ్డది
– కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు ..తమకు ఏనాడైనా నీళ్లు వస్తాయనే దైర్యం తో రైతులు వ్యవసాయం పెంచారు
– 24 గంటల కరెంటు కేసీఆర్ ఇచ్చారు కనుకే ధాన్యం దిగుబడి పెరిగింది
– మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్ ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షు డు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,బాలరాజు యాదవ్ ,కిషోర్ కుమార్
హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరగడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డ అన్నారం ,సుందిళ్ల బ్యారేజీలను వర్షాకాలం లో బాగా వానలు పడ్డప్పుడు కేసీఆర్ హాయం లోనూ వాడలేదు. ప్రాణహిత నీళ్లను వాడుకునే అవకాశాలను కాళేశ్వరం ప్రాజెక్టు కల్పిస్తోంది.
ఎల్లంపల్లి ,మిడ్ మానేరు పంపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా ? రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ రైతులకు ధైర్యం ఇచ్చారు. తట్టెడు మన్ను తీయని రేవంత్ పండిన ధాన్యాన్ని తన ఖాతా లో వేసుకునే హక్కు లేదు. పంట విస్తీర్ణం భారీ గా పెరగడమే ధాన్యం దిగుబడి పెరగడానికి కారణం. కేసీఆర్ తీసుకున్న రకరకాల రైతాంగ అనుకూల విధానాలు సాగు విస్తీర్ణం పెరగడానికి కారణం.
కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు ..తమకు ఏనాడైనా నీళ్లు వస్తాయనే దైర్యం తో రైతులు వ్యవసాయం పెంచారు. రేవంత్ రెడ్డి అనాలోచితంగా మాట్లాడుతున్నాడు. మూసీ కి నీళ్లు తెస్తానంటున్న రేవంత్ కాళేశ్వరం నీళ్ళే కదా తెచ్చేది?మల్లన్న సాగర్ కు కాళేశ్వరం నీళ్ళే కదా వచ్చేది? రేవంత్ రెడ్డి ..మేడిగడ్డ ,సుందిళ్ల ,అన్నారం బ్యారేజీలే కాదు కాళేశ్వరం అంటే.
1990 నుంచి 2014 వరకు క్రమంగా తగ్గిన వరి పంట విస్తీర్ణం 2014 తర్వాత ఎందుకు పెరిగింది? కేసీఆర్ రైతు అనుకూల పాలన వల్ల కాదా ? కేసీఆర్ తెచ్చిన రైతు బంధు వల్లనే రైతు లో విశ్వాసం పెరిగింది. రైతు బంధే రైతు లో ధైర్యాన్ని పెంచింది. యాభై యేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వ్యవసాయం లో వెనక బడ్డది. కేసీఆర్ పదేండ్ల పాలనలోనే రైతు బాగుపడ్డడు.
24 గంటల కరెంటు కేసీఆర్ ఇచ్చారు కనుకే ధాన్యం దిగుబడి పెరిగింది ..అది కొనసాగుతోంది. రైతు పండించిన పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం కేసీఆర్ మొదలు పెట్టి రైతులో విశ్వాసం పెంచారు. గులాబీ జెండా వల్లే రైతుకు భరోసా ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజి ఇంత వర్షాకాలం లోనూ నిలబడ్డది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కుంగిన మేడిగడ్డ పిల్లర్ ను ఇప్పటికే బాగు చేసే వాళ్ళం. బీజేపీ , కాంగ్రెస్ ఎంపీ లు ఒక్కసారైనా మేడిగడ్డ రిపేర్ గురించి కేంద్ర పెద్దలను అడిగారా? బీ ఆర్ ఎస్ ఎంపీ లు పది మంది ని గెలిపిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు.
మంత్రి సీతక్క కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్నారు. సీతక్క ప్రజా పాలనా విజయోత్సవాలు జరుపుతామంటున్నారు. ప్రజా వంచన వారోత్సవాలు జరుపుకోవాలి. లగచర్ల లో గిరిజనుల పై దౌర్జన్యాలు జరిగితే స్పందించని సీతక్క లేని గొప్పలు చెప్పుకుంటున్నారు. గ్యారంటీలు అమలు చేయనందుకు సీతక్క ప్రజలకు క్షమాపణ చెప్పాలి.