– పరీక్ష పేరుతో కోట్లు దోపిడీ చేస్తున్న నారాయణ యాజమాన్యాలు
– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎద్దు రాహుల్, వీరపోగు రవి
కడప: జిల్లా లో ఉన్న కార్పొరేట్ నారాయణ పాఠశాలలు టాలెంట్ టెస్ట్ పరీక్ష పేరుతో.. కోట్ల రూపాయలు వసూలు చేసి పరీక్ష నిర్వహిస్తుండగా అడ్డుకున్నట్లు ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు ఎద్దు రాహుల్, వీరపోగు రవి వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థలు టాలెంట్ టెస్ట్ అనే పేరుతో విద్యార్థులకి ఎక్కువ మార్కులు వస్తాయని కోట్ల రూపాయలు వసూలు చేసి, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. తల్లిదండ్రులకి ఎక్కువ మార్కులు వస్తాయని, ప్రైజ్ లు ఇస్తామని, హైయర్ క్లాస్ కి ప్రమోట్ చేస్తామని మాయ మాటలు చెప్పి వసూలు చేస్తున్నారు. అయినా జిల్లా విద్యాశాఖ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యం ఏమిటి? ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియాల్సి ఉంది. ఇప్పటి కైనా నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు.