Suryaa.co.in

Andhra Pradesh

అరాచక పాలకుడిని రాష్ట్రం నుండి తరిమికొడదాం

ప్రజాగళం సభలో బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రసంగం

రాష్ట్రంలో గరళాన్ని నింపుతున్న వ్యక్తికి ప్రజాగళం గుణపాఠం కావాలి. గొడ్డలిపోటు నేతకు ఈ సభద్వారా గుండెపోటు తెప్పించాలి. అబద్దాలపై అబద్దాలు చెబుతూ ముఖ్యమంత్రి అవినీతి పాలన సాగిస్తున్నారు. అబద్దాలకోరు సిఎంను అత్తారింటికి దారేది చెట్టుకింద నిలబెడితే ఆకులు రాలడమేకాదు, చెట్టు కూకటివేళ్లతో పడిపోతోంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన అరాచక పాలకుడ్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టవద్దా? మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వికసిత భారత్ రాజ్య స్థాపన జరుగుతోంది. ఎపిలో చంద్రబాబు, పవన్, బిజెపి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చి మళ్లీ అభివృద్ధి బాట పట్టాలి.

LEAVE A RESPONSE