ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క బీసీకైనా న్యాయం చేశారా?

– ప్రజాగళం సభలో జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు

జగన్ రెడ్డి అభ్యర్ధుల ప్రకటనలో బీసీలకు న్యాయం చేశానని చెబుతున్నాడు. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క బీసీకైనా న్యాయం చేశారా? కొందరికి సీట్లు ఇస్తే.. అందరికీ న్యాయం చేసినట్లేనా? సంక్షేమాన్ని నాశనం చేసిందెవరు? బీసీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో సదుపాయాలెందుకు లేవో సమాధానం చెప్పాలి. బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయడమే సామాజిక న్యాయమా? బటన్ నొక్కానని చెప్పడానికి కాస్తైనా సిగ్గుపడాలి. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే కృత నిశ్చయంతో మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి. ప్రజలంతా కూటమికి మద్దతుగా నిలవాలి. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం.

Leave a Reply