కలసి కదం తొక్కండి

– గుంటూరులోని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు క్యాంపు కార్యాలయంలో టీడీపీలో చేరిన చుండూరు మండలం మండూరు గ్రామ 30 కుటుంబాల వైసీపీనేతలు,కార్యకర్తలు

ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ.. ముందుగా వైసీపీ ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన చుండూరు మండలం మండూరు గ్రామం నుండి జొన్నకూటి సాంబశివరావు, రెడ్డి ధనుంజయ, తాడిశెట్టి బాబు, గుండాల వెంకటేశ్వర్లు, దర్శి సంసోను, దేవిరెడ్డి మల్లికార్జున,వారితో పాటు దాదాపు 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లోకి రావటం అనందం గా ఉంది. వారికీ తెలుగుదేశం పార్టీ స్వాగత అభినందనలు తెలియచేస్తూ రాబోయే కాలంలో మనమందరం కలిసి పనిచేద్దాము అని పిలుపునిస్తున్నాను.

రాష్ట్ర – వేమూరు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేయాలని అన్నారు. మీరు ఐక్యంగా పని చేసి రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తెలుగుదేశం పార్టీ ని విజయ తీరాల కు చేర్చే భాద్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాలి.

ఈ కార్యక్రమం లో చుండూరు మండలం, మండూరు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చుండూరు మండలం మండూరు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి జొన్నకూటి సాంబశివరావు, రెడ్డి ధనుంజయ, తాడిశెట్టి బాబు, గుండాల వెంకటేశ్వర్లు, దర్శి సంసోను, దేవిరెడ్డి మల్లికార్జున,వారితో పాటు దాదాపు 30 కుటుంబాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి నక్కాఆనందబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Leave a Reply