నిరుద్యోగులకు ఉద్యోగం రాకుండా అడ్డుకునేందుకే జాబ్ మేళాపై లోకేష్ ఫిర్యాదు

– మూడుసార్లు చంద్రబాబు సిఎం అయినా కుప్పంకి చేసింది ఏమి లేదు
– ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి

వైఎస్ఆర్ సిపి తలపెట్టిన జాబ్ మేళాను అనుమతించవద్దని కోరుతూ టిడిపి నేత లోకేష్ యూజిసికి లేఖ రాసిన విషయం తెలిసి జనం నవ్వుకుంటున్నారని వైఎస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలపై ఆయన స్పందించారు.

నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళా ఏమైనా నిషేధిత కార్యక్రమమా అంటూ లోకేష్ ను ప్రశ్నించారు. 2019, మార్చి16 న, చంద్రబాబు హయంలోటీడీపీ బూత్ కమిటీ కన్వీనర్ల మీటింగును తిరుపతి యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. విలువలు పాటించలేదని దాన్ని కూడా లేఖలో ప్రస్తావించల్సిందని లోకేష్ కు హితవు పలికారు. యూజిసికి లేఖ రాయడంపై లోకేష్ తీరును ఆయన తప్పుబట్టారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సొంత నియోజకవర్గం కుప్పంకి చేసింది ఏమీ లేదన్నారు.మొన్నామధ్యే కుప్పం ప్రజలు స్థానిక సంస్ధల ఎన్నికల్లో టిడిపిని ఓడించి, వైఎస్సార్ సిపి గెలిపించిన విషయానన్ని టిడిపి నాయకుడు లోకేష్ గుర్తుంచుకోవాలని చెప్పారు. చంద్రబాబు 3సార్లు సిఎంగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీ, రెవిన్యూ డివిజన్ చేయలేదని గుర్తు చేశారు. లోకే ష్ గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన విషయం గుర్తుంచుకోవాలని, గతం మర్చిపోతే ఎట్లా చిట్టీ!అంటూ వ్యాఖ్యానించారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎన్నడూ లేనంతగా 7,740 మిలియన్ల డాలర్ల సముద్రపు ఎగుమతులను సాధించడం గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో దేశంలోని ఎగుమతుల్లో 40% ఏపి నుండి జరిగాయని చెప్పారు.

Leave a Reply