ఇక ఏటీఎం లేకుండానే డబ్బు డ్రా

ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు లేకుండానే అన్ని ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించుకునేలా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
బ్యాంకు మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునేలా.. అన్ని బ్యాంకులను అనుమతించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం కార్డు రహిత నగదు ఉపసంహరణ కొన్ని బ్యాంకుల్లోనే అందుబాటులో ఉంది. ఇకనుంచి అన్ని బ్యాంకుల్లో, ఏటీఎం నెట్వర్క్ లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది.

Leave a Reply