-రేపు మా ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఊరుకునేది లేదు
-తప్పు చేసిన అందరూ శిక్ష అనుభవిస్తారు
– తెనాలిలో లోకేష్
2019 ఎన్నికల తర్వాత నరేంద్రనాథ్ నాకు పరిచయం అయ్యారు. టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారు.మళ్ళీ టిడిపి గెలవాలని బలంగా ఆకాంక్షించారు. ఆయన మరణించిన విషయం తెలిసి చాలా బాధపడ్డాను. నరేంద్రనాథ్ కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది..
అన్నా క్యాంటీన్ ల పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన నారా లోకేష్. ఈ ప్రభుత్వం అన్నం పెట్టదు, పెట్టే వాళ్లను పెట్టనివ్వడం లేదు.మంగళగిరి, కుప్పం, తెనాలి అన్ని చోట్లా అన్న క్యాంటిన్లను అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతుంది? టిడిపి అన్న క్యాంటీన్ నడిపితే వారికి అభ్యంతరం ఏంటి? ప్రజలకు మంచి చేయటమే టిడిపి పని.టిడిపి నేతలపై దాడులు జరుగుతున్నాయి, విజయవాడలో చెన్నుపాటి గాంధీపై దాడి చేశారు.
రేపు మా ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఊరుకునేది లేదు. తప్పు చేసిన అందరూ శిక్ష అనుభవిస్తారు. సంగం డెయిరీ రైతులకు మేలు చేస్తుంటే దాన్ని ఆపేందుకు కుట్ర ఉన్నారు. నాపైనా 15 కేసులు పెట్టారు, 7 సార్లు స్టేషన్ కు తీసుకెళ్లారు.