Suryaa.co.in

Andhra Pradesh

శాస్త్రోక్తంగా శ్రీ హరిహర క్షేత్రంలో మహా పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం

-స్వాత్మానందేంద్ర సరస్వతి చేతులమీదుగా మహా సంప్రోక్షణ, మహా పూర్ణాహుతి,కుం కుంభాభిషేకం
-మహా పూర్ణాహుతి,కుంభాభిషేకంలో పాల్గొన్న మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు.కుటుంబ సభ్యులు
-నయన మనోహరంగా నగరోత్సవం పాల్గొన్న భక్త జన సందోహం

చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతుల ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న 18 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు జగద్గురువు శంకరా చార్య స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి వారి అనుజ్ఞ తో శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి అధ్వర్యంలో.22 తేదీ నుండి ప్రారంభం అయిన 23 వ తేదీ వరకు జరిగిన 18 వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.

మంగళవారం ఉదయం శ్రీ హరిహర సుత అయ్యప్పస్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి,శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి,శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి,శ్రీ పార్వతి సమేత నగరేశ్వర స్వామి వార్లకు విశేష అభిషేకాలు,గణపతి పూజ,వీక్ష్వసేన ఆరాధన,మహా మూల మంత్రం, మండపారాధన, ప్రధాన కలశ పూజలు విశాఖ శారదా పీఠం వేద పండితులు దీక్షితులు బృందం చే అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులను,శిద్దా పాండురంగారావు దంపతులను ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా పాండురంగారావు దంపతులు, శిద్దా పెద్ద బాబు,శిద్దా బాలాజీ దంపతులు క్షేత్రంలో కొలువై ఉన్న సకల దేవతలకు విశేష పూజలు నిర్వహించి స్వామి వారి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

అనంతరం విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వా త్మానందేంద్ర మహా స్వామి వారికి శిద్దా రాఘవరావు దంపతులు,,శిద్దా సాయిబాబు, శిద్దా పాండురంగారావు దంపతులు వేద పండితులు మంగళ వాయిద్యాలు,వేద మంత్రాల నడుమ పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. స్మాత్మానందేంద్ర మహా స్వామి శిద్దా రాఘవరావు దంపతుల తో కలిసి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి,పార్వతి సమేత నగరేశ్వర స్వామి,శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారు.శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి,శ్రీ అయ్యప్ప స్వామి వారికి ,గోపూజ విశేష పూజలు నిర్వహించారు.

కలశ పూజ నిర్వహించిన శిద్దా రాఘవరావు దంపతులు
గత రెండు రోజులుగా జరుగుతున్న నిత్య హోమాలు,మూల మంత్ర హోమం,కళాన్యాస హోమాలతో శ్రీ హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.అనంతరం శ్రీశ్రీశ్రీ స్వాత్మ నందేంద్ర మహా స్వామి శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో ,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, పార్వతి సమేత నగరేశ్వర స్వామి ఆలయంలో శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా పాండురంగారావు దంపతులచే కలశ ప్రదక్షిణ నిర్వహించి వేద పండితుల మంత్రత్సారణ ,మంగళ వాయిద్యాల నడుమ మహా పూర్ణాహుతి కార్యక్రమంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.తదుపరి శ్రీ హరిహర క్షేత్రం 18 వ వార్షికోత్సవంలో భాగంగా కీలక అంశంగా భావించే మహా సంప్రోక్షణ కార్యక్రమం స్వాత్మా నందేంద్ర స్వామి,ఆస్థాన వేద పండితులచే మహా కుంభాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అనంతరం మాజీమంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రం 18 వ వార్షికోత్సవం వైభవంగా జరగడం ఆనందంగా ఉందని అన్నారు.లోక కళ్యాణార్ధం రెండు రోజులు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు ,మహా పడి పూజ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.భగవంతుడి ఆశిస్సులతో కార్యక్రమాలు విజయ వంతం కావడం సంతోషకరం అన్నారు.చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ఏటా నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమాలకు విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపా నందేంద్ర మహా స్వామి,ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వార్తనందేంద్ర మహా స్వామి వారి
దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ వేడుకలు విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందని అన్నారు..

శ్రీ హరిహర క్షేత్రం 18 వ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి,ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలకు తమ అనుగ్రహం మాకు అందచేసిన శ్రీ శ్రీ శ్రీ స్వరూపా నందేంద్ర మహా స్వామి వారికి ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మా నందేంద్ర మహా స్వామి వారికి,సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలువుతున్నట్లు మహా స్వామి ఆశిస్సులు ఎల్లవేళలా మనందరికీ కలగాలని కోరుకుంటున్నట్లు శిద్దా రాఘవరావు తెలిపారు.

అనంతరం విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వా త్మా నందేంద్ర భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణ చేశారు శ్రీ హరిహర క్షేత్రంతో మా పీఠానికి ఉన్న అనుబంధం ఏళ్ల నాటిదని అన్నారు.17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18 వ సంవత్సరం లో అడుగు పెడుతున్న దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ హరిహర క్షేత్రం భవిష్యత్ లో ఎంతో గొప్ప క్షేత్రంగా వెలుగొందుతుంది .చీమకుర్తి గ్రానైట్ కు మాత్రమే ప్రసిద్ధి కాదని, హరిహర క్షేత్రం స్థాపన తరువాత ఒక ఆధ్యాత్మిక ప్రదేశం గా పేరు వచ్చింది అని స్వామి అన్నారు.

మారుమూల ప్రాంతం అయిన చీమకుర్తి గ్రామంలో శ్రీ హరిహర క్షేత్రం నిర్మించాలని శిద్దా రాఘవరావు సంకల్పం వెనుక దేవతల అనుగ్రహం ఉందని, క్షేత్రం నిర్మించడం అంటే సామాన్యుల వలన సాధ్యం కాదని భగవత్ సంకల్పంతో ఆది సాద్యం అవుతుందని స్వామిజీ తెలిపారు. శిద్దా రాఘవరావు కుటుంబం ఎంతో పుణ్యం చేసుకున్నారని అందరికి ఈ యోగం రాదని కారణ జన్ములకు మాత్రమే ఇది సాధ్యం అవుతుందని తెలిపారు. కలియుగంలో ఎన్నో ఆలయాల స్థాపనకు శిద్దా రాఘవరావు గ్రానైట్ రాయి ఉచితంగా అందచేశారు అని ఇది వారి దాతృత్వనికి ఒక ఉదాహరణ అని తెలిపారు.

కలే స్మారణ ముక్తేహి అంటే ఎక్కడైతే దేవతలకు నిత్య పూజలు జరుగుతాయో,ఎక్కడ అయితే దేవతల ఆరాధన ఉంటుందో, ఎక్కడ అయితే నిత్య హోమాలు,భగవత్ జపాలు వుంటాయో,అక్కడ దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. శ్రీ హరిహర క్షేత్రం మహిమ గల పుణ్య క్షేత్రం,ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరు వచ్చింది అని స్వామి అన్నారు.శ్రీ హరి హర క్షేత్రంలో సమూహక మూర్తులకు ఆరాధన చేయడమే క్షేత్ర మహిమ గా మనం చెప్పు కోవాలని అన్నారు.

సాక్ష్యాత్తు సన్నిధానంలో జరిగే విధంగా అయ్యప్పస్వామి పడి పూజలు నిర్వహించడం శ్రీ హరిహర క్షేత్రం మహిమగా చెప్పచ్చు అని అన్నారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవ,పేదలకు అండగా ఉండటం,కష్టాలలో ఉన్న మానవులకు తోడు ఉండటం,మానవ సేవే మాధవ సేవ చేసే శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా సుధీర్ కుమార్ దంపతులు వారి కుటుంబ సభ్యులు,,సోదరులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు మహా స్వామి తెలిపారు.

అనంతరం స్వాత్మ నందేంద్ర మహా స్వామి శిద్దా రాఘవరావు దంపతులకు,,శిద్దా వెంకటేశ్వర్లు,శిద్దా పాండురంగారావు దంపతులకు, శిద్దా పెద్ద బాబు దంపతులు, శిద్దా సూర్య ప్రకాశరావు,,బోమ్మిశెట్టి శ్రీనివాసరావు, చీమకుర్తి కోటిలింగం దంపతులకు,,శిద్దా బాలాజీ దంపతులకు,ఎమ్.శివ రామ్ దంపతులకు,బొమ్మిసెట్టి కిరణ్,వైసీపీ నాయకులు మారం వెంకారెడ్డి లకు ఆశీర్వదాలతో పాటుగా అమ్మవారి ప్రసాదాలు,శేష వస్త్రాలు అందచేశారు . శిద్దా వెంకటేశ్వర్లు,వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు భోజన సదుపాయాలు కల్పించారు.ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ,హరి కుమార చార్యులు,హరికృష్ణ శర్మ, భక్తులకు తీర్థప్రసాదాలు అందచేసారు.

సాయంత్రం జరిగిన శ్రీ హరిహర క్షేత్రం శ్రీ అయ్యప్పస్వామి, శ్రీదేవి భూదేవి సమెత శ్రీ వెంకటేశ్వర స్వామీ, శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారు,శ్రీ పార్వతి సమేత నగరేశ్వర స్వామి నగరోత్సవం నయనా నందకరంగా సాగింది. శిద్దా రాఘవరావు దంపతులు ఆధ్వర్యంలో జరిగిన సర్వ దేవత మూర్తుల నగరోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శిద్దా కుటుంబ సభ్యులు,ఉదయ్ మారం వెంకరెడ్డి, చలువాది బద్రి నారాయణ గోల్డెన్ గ్రానైట్ ఏ గిరి ,చలువాది బదరి నారాయణ గ్రానైట్ రంగాలకు చెందిన ప్రముఖులు,దర్శి,ఒంగోలు,కందుకూరు, మార్కాపురం కు చెందిన ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE