Suryaa.co.in

Features

మంచు కురిసే వేళలో…

– ఇళైయరాజా పాట

1987లో వచ్చిన అభినందన సినిమాలోని ప్రేమ యుగళ గీతం “మంచు కురిసే వేళలో…”

శుద్ధ ధన్యాసి రాగంలో ఇళైయరాజా చేసిన పలు మంచి పాటల్లో ఇదీ ఒకటి. ఎస్. జానకి, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పాడారు. వేణువు వాదనతో ప్రారంభ సంగీతం (prelude) మనోజ్ఞంగా ఉంటుంది. ఇంపు, సొంపులే ముఖ్యంగా రూపొందిన పాట ఇది.

ఈ పాట తొలుత 1983లో వచ్చిన ఆయిరమ్ నిలవే వా అన్న తమిళ్ష్ సినిమాలో వచ్చింది. “అన్దరఙ్‌గమ్ యావుమే…” అంటూ ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పాడిన సోలో. తమిళ్ష్‌ పాటలో bass line chords ఇంకా సూచనాత్మకంగా (pointedly) చెప్పాలంటే slap style bass chords ను గొప్పగా పొందుపఱిచారు ఇళైయరాజా. Bass line chordsను శంకర్- జైకిషన్ చెప్పుకోతగ్గట్టు మనదేశ చలనచిత్ర గీతాల్లో వాడారు.

అటు తరువాత ఆర్.డీ. బర్మన్ గొప్ప ప్రతిభతో, విజ్ఞతతో, సౌందర్యజ్ఞతతో ప్రశస్తంగా Bass line chordsను ప్రయోగించారు. ఆ కోవలో దక్షిణాదిలో ఇళైయరాజా Bass line chordsను పలు పాటల్లో గొప్పగా ప్రయోగించారు.

ఇళైయరాజాకు ముందు దక్షిణాదిలో Bass line strigsను కానీ Bass line chordsను కానీ చెప్పుకోతగ్గ స్థాయిలోనూ, మేలైన రీతిలోనూ, ప్రౌఢంగానూ మఱే సంగీత దర్శకుడూ ప్రయోగించ లేదు. ఇళైయరాజా తరువాత ఎ.ఆర్. రహ్మాన్ Bass line musicను అంతర్జాతీయ స్థాయిలో ప్రయోగించారు.

ఒకే మట్టుకు (బాణికి) వేర్వేఱు లేదా విభిన్న వాద్య సంగీతాన్ని పొదివి తన మేలైన, మిన్నైన సృజనాత్మకతా చాతుర్యాన్ని చాటుకున్నారు ఇళైయరాజా.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE