– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి : పీపీపీ మోడల్ లో మెడికల్ కళాశాలల నిర్మాణం వల్ల నష్టం లేదు… వైసీపీ అసత్య ప్రచారం తో రాద్దాంతం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. 33 యేళ్ల తరువాత మళ్లీ ప్రభుత్వానికి ఆ కళాశాలు చెందుతాయి. మెడికల్ కళాశాలలు పూర్తి అయితే 1500 సీట్లు వస్తాయి.. ఇందులో 725 సీట్లు పూర్తిగా ఉచితం. యన్టీఆర్ వైద్య సేవలు కింద కార్పొరేట్ ఆస్పత్రి లో వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
మెడికల్ కళాశాలలను అందుబాటులో కి తెస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రజలకు ప్రతి చోటా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే మా లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో మాట్లాడుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. 108, 104 లను ప్రైవేటు వ్యక్తులు తో నడిపారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటు పార్టనర్ షిప్ తో చేస్తే తప్పేంటి? అసెంబ్లీ కి రా చర్చిద్దాం అంటే వచ్చే ధైర్యం లేదు. రిషికొండలో వందల కోట్లు తో భవనాలు నిర్మించారు. మరి ఈ మెడికల్ కళాశాలలు ఎందుకు పూర్తి చేయలేదు. ప్రజలు చదువకుండా యువత మేదో సంపత్తి ని జగన్ నాశనం చేశారు.
నర్సీపట్నం లో మెడికల్ కళాశాలను జగన్ నిర్మించలేదు. ఐదు వందల కోట్లు అయితే జగన్ ఖర్చు పెట్టింది ఇరవై కోట్లు. మెడికల్ కళాశాలకు ఆయన ఇచ్చే నిర్వచనం ఏమిటో జగన్ కే అర్థం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే ఈ మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రజలు ను తక్కువ అంచనా చేసిన జగన్ కు తగిన గుఠపాం చెప్పారు. అయినా ఇంకా పాత పద్ధతి లోనే జగన్ వెళుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీం తెచ్చింది జగనే.. ఇప్పుడు ఆయనే విమర్శిస్తున్నారన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధులపై గురుతర బాధ్యతలు ఉన్నాయి. ఏ అంశం మాట్లాడినా ఆ విషయం పై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఆగ్రహం, ఆనందం, ఆవేదన అయినా మీడియా సమావేశాల్లో, సభల్లో మీ ముఖంలో కూడా కనిపించాలన్నారు.