చెస్ పోటీలు ప్రారంభించిన మంత్రి రోజా

Spread the love

-తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ పోటీలు ప్రారంభించిన మంత్రి రోజా
-ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే
-క్రీడలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వం
-గ్రామ స్థాయి నుండి అన్ని పాఠశాలల్లో చదరంగం ఆటను ప్రోత్సహిస్తాం: మంత్రి రోజా

తిరుపతి, అక్టోబర్ 29: రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ విజయవాడ మరియు రాష్ట్ర చెస్ అసోసియేషన్ విజయవాడ వారి సంయుక్త ఆద్వర్యములో తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ నేడు, రేపు జరుగుతున్న జాతీయ స్థాయి పోటీలను శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ తిరుపతి నందు గౌ. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖామాత్యులు ఆర్.కే.రోజా శాప్ వి.సి. అండ్ ఎం.డి. ప్రభాకర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదని, ఆంధ్రప్రదేశ్ ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదేనని అన్నారు. చదరంగం అనేది ఒక ఆటroja1 మాత్రమే కాదు జీవితం కూడా ఒక చదరంగమే అని అందులో రాజు, మంత్రి, సిపాయి ఉన్నా మన జీవితంలో మనమే రాజు, మంత్రి, సిపాయి అన్నీ మనం తీసుకునే నిర్ణయమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అందుకే ఆచి తూచి చదరంగంలో వలె జీవితంలో అడుగులు జాగ్రత్తగా వేయాలని అన్నారు.

ప్రతి విద్యార్ధి, విద్యార్థినులు అన్ని స్థాయిలలోని వారు చదరంగంపై మక్కువ పెంచుకునే విధంగా పాఠశాల స్థాయి నుండే చదరంగం ను పరిచయం చేసి, నిపుణులైన కోచ్ లను ట్రైన్ చేసి వారిచే శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఆట వలన మెదడు చాలా చురుకుగా పనిచేసి చదువులో ముందు ఉండుటకు దోహదం చేస్తుందని, చెస్ అనేది మైండ్ తో ఆడే ఆట అని బలంతో కాదని అందుకే ఇందులో గెలిచిన వారిని గ్రాండ్ మాస్టర్ అంటారని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా చదరంగ భారతి కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించ బోతున్నామని అన్నారు.

ఇందులో భాగంగా 33 మంది కోచ్ లను వర్చువల్ విధానంలో శిక్షణ ఇచ్చి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వీరు అందుబాటులో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ క్రీడలను అభివృద్ధి చేయడానికి యువతకు గ్రామీణ స్పోర్ట్స్ క్లబ్ లు, సిటీ స్పోర్ట్స్ క్లబ్ లు ఏర్పాటు మరియు గతంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్ నుండి డిసెంబర్ 21 వరకు యువతకు కబడ్డీ వాలీబాల్ తదితర పోటీలు నిర్వహించి రూ.50 లక్షల ప్రైజ్ నిధులు కేటాయించి ప్రోత్సహిస్తున్నామని గౌ.ముఖ్యమంత్రి జన్మదినo నాటికి తుది గెలుపు పొందినవారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని అన్నారు. అనంతరం మంత్రి ఎడిఫై స్కూల్ చైర్ పర్సన్ సులోచన తో, పిల్లలతో చదరంగం ఆడారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆటల పోటీలలో గెలుపు ఓటములు సర్వసాధారణమని పోటీలలో పాల్గొనడం ముఖ్యమని, ప్రతి ఒక్కరు ఆట స్ఫూర్తితో ఆడాలని కోరారు. ఈ చెస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గెలవడానికి ప్రయత్నించాలి అని ఓడిపోతే గెలిచినవారి నైపుణ్యాన్ని గమనించి వారి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ జాతీయ స్థాయి చెస్ పోటీలలో గెలిచినవారికి రూ.5 లక్షల విలువగల ప్రోత్సాహకాలు ఉన్నాయని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్న శాప్ మరియు ఆంధ్ర చెస్ అసోషియేషన్ విజయవాడ వారికీ ధన్యవాదాలు తెలిపారు.

శాప్ వి.సి. మరియు ఎం.డి. మాట్లాడుతూ జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను క్రీడా శాఖ మంత్రి ప్రోత్సాహంతో ఏర్పాటు చేసి అందులో గ్రామీణ, పట్టణ యువతకి ఆసక్తి కలిగిన ఆటలలో పాల్గొనుటకు పేర్లు నమోదు చేసుకునేలా చేసి, తద్వారా ఏ ఆటల పట్ల యువత ఆసక్తి కలిగి ఉన్నారో సమాచారం మేరకు వాటిని ప్రోత్సహించే దిశగా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. నేటి ఈ పోటీలకు 10 రాష్ట్రాల నుండి 350 మంది, 100 మంది అంతర్జాతీయ రేటింగ్ కలిగిన క్రీడాకారులు, అంతేగాక 6 మంది అంతర్జాతీయ మాష్టర్లు ఈ పోటీలలో పాల్గొననున్నారని మరియు శ్రీలంక దేశస్థుడు అనుభవజ్ఞుడు ఆటగాడు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ పోటీలలో అండర్ 7,9,11,13,15 మరియు ఓపెన్, స్త్రీలు, విబిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు నమోదు చేసుకుని పాల్గొనవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎ.పి. చెస్ అసోషియేషన్ శర్మ, ఎడిపై స్కూల్ చైర్ పర్సన్ సులోచన, ఆర్బిటర్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ధర్మేంద్ర కుమార్, మాజీ టి.టి.డి. బోర్డ్ మెంబెర్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎ.ఐ.ఎస్.ఎఫ్. డి.పి.అనంత, సి.ఈ.ఓ. సెట్విన్ మరియు డి.ఎస్.ఎ. మురళీ కృష్ణ, ప్రవీణ్, ప్రసాద్, జ్వాలాముఖి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply