– కరపత్రాలు పంచుతూ.. ఓట్లు అభ్యర్థిస్తూ పర్యటన
రామచంద్రపురం : ఈనెల 27న జరగనున్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం రామచంద్రపురంలో సుడిగాలి పర్యటన చేశారు.
కూటమి పార్టీ సీనియర్ నాయకులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం , జనసేన ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, రామచంద్రపురం ఎన్నికల పరిశీలకులు కాకినాడ రామారావు, పట్టణ అధ్యక్షులు కడియాల రాఘవన్ ఆధ్వర్యంలో పలు వార్డులో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నేరుగా పట్టభద్రులైన ఓటర్లను కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం అందించాలని కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు.