Suryaa.co.in

Political News

మన చుట్టూ అద్భుతాలు

అద్భుతాలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అలాంటి చాలా వాటిని, వాటికి కారణమైన వ్యక్తులను మనం గమనించం. ప్రస్థుత రాజకీయాల్లో అలాంటి అద్భుతమే “చంద్రబాబు”.

అతి సాధారణ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి గ్రామీణ వాతావరణంలో పెరిగి, ఎలాంటి ప్రత్యేకతలు లేని చంద్రబాబు కి ఇంత పెద్ద అలోచనలు రావటం అధ్బుతం.

సైన్స్ వేరు, సృజనాత్మకత వేరు. పది, ఇరువై సంవత్సరాల కాలాన్ని ముందే ఊహించటం, అప్పటికి ప్రజలకు ఏం కావాలో ముందే ఆలోచించ గలగటం ఒక అద్భుతం.

అందులోనూ డబ్బూ, అధికారం, కుట్రలు, కార్పణ్యాలు తప్ప, ఇంకోటి తెలియని రాజకీయుల జాతిలో ఉండి… స్వంతంగా, తన కోసం, తన కుటుంబం కోసం ఆస్థులు కూడదామనే కోరిక, ఎలాగోలా దోచుకొని సంపద కూడబెట్టే తెలివితేటలు చాలామందికి ఉంటాయి.కానీ రాష్ట్రం కోసం, ప్రజల కోసం సంపద సృష్టించాలని, నిరంతరం ఒక వ్యక్తి తాపత్రయపడటం ఈ కాలంలో ఒక అధ్బుతం… ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి, తన ఆలోచనల ద్వారా, తన నిర్ణయాల ద్వారా కొన్ని లక్షల కుటుంబాల జీవన ప్రమాణాలు మారేలా చేయ గలగటం అద్భుతం.

కాసేపు కులమతాలు, రాజకీయ సిద్దాంతాలు ప్రక్కన పెట్టి ఆలోచించగలిగితే, అందరికీ అర్ధమయ్యే అద్భుతమే చంద్ర బాబు.
కాలానుగుణంగా సైన్సు, టెక్నాలజి, తదితర ఆధునిక అంశాల మీద అవగాహన పెంచుకుంటూ, తన ప్రాధాన్యతలను మార్చుకుంటూ, ప్రతి క్షణం ప్రజల అభ్యుదయం గురించి ఆలోచించే చంద్రబాబు ఉండటం మనందరి అదృష్టం.

ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ప్రజాభిమానం పొందగలగటం చంద్రబాబు అదృష్టం కూడా. సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబు కి సరితూగగలిగే వ్యక్తి దేశంలో ఇంకొకరు లేరు అనేది అతిశయోక్తి కాదు…
నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించు బాబు..

– తీగల రవీంద్ర

LEAVE A RESPONSE