– ఇంజినీరింగ్ సిబ్బంది పర్వేక్షణలో నాణ్యతా ప్రమాణాలతో కాజ్ వే నిర్మాణ పనులు చేయవలసిందిగా సూచన.
ఇందుకూరు పేట : కాజ్ వే నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకూరు పేట మండలం ముదివర్తి పాళెం కాజ్ వే నిర్మాణ పనులను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులు మరియు కాంట్రాక్టర్ తో ఆమె మాట్లాడారు.
ఇంజినీరింగ్ సిబ్బంది పర్వేక్షణలో కాజ్ వే నిర్మాణ పనులు చేయవలసిందిగా కాంట్రాక్టర్ రమేష్ చౌదరి కి సూచించారు. ఎప్పటికప్పుడు నాణ్యతా ప్రమాణాల పర్వేక్షిస్తూ త్వరితగతిని కాజ్ వే నిర్మాణ పూర్తయ్యేలా చూడాలని ఇరిగేషన్ ఇంజనీర్లు విజయభాస్కర్ రెడ్డి , నాగరాజు ను కోరారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి, ఇందుకూరు పేట మండల టిడిపి అధ్యక్షులు వీరేంద్ర నాయుడు, టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, చెంచుకిషోర్ యాదవ్, దేవిరెడ్డి రవీంద్రారెడ్డి,జనసేన చప్పిడి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.