– సీఎం చంద్రబాబు పాలనే మాకు ఆదర్శం
– బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం
– జగన్ కు లండన్ మందులు వికటించాయి.. అందుకే పిచ్చి ప్రేలాపనలు
– ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టండి.
– ఎస్సీ, ఎస్టీ పట్టబద్రుల ఆత్మీయ సమావేశంలో మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ మాథూర్
రామచంద్రపురం : పట్టభద్రులారా.. అభివృద్ధికి ఓటెయ్యండి.. కూటమి అభ్యర్థికి సహకరించండి.. ఎన్డీఏ కూటమి ఎనిమిది మాసాల పాలన మా ప్రభుత్వానికి రెఫరండంగా భావిస్తాము అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం లోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో నియోజవర్గ స్థాయి ఎస్సీ,ఎస్టీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణల, కూటమి ముఖ్య నేతలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హాజరైన పట్టబద్రులు నుద్దేశించి మంత్రి సుభాష్ మాట్లాడుతూ గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక ఓటర్లు కూటమి ప్రభుత్వానికి కొండంత బాసటగా నిలిచారన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సహకరించాలని కోరారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనకు, ఎనిమినెలల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని భేరీజు వేసుకొని పట్టబదులు ఓటెయ్యాలన్నారు.
అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషితో రాష్ట్రానికి రూ. 6.80 లక్షల కోట్లు పెట్టుబడులు రూపంలో రానున్నాయని, తద్వారా 4.30 లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్న యన్నారు. జగన్ పాలనలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, సుమారు 40 పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి అని విమర్శించారు. జగన్ కు లండన్ మందులు వికటించి ఉండవచ్చని, అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, ఆయనకు మంచి వైద్యం అందించాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తగినన్ని నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా విశాఖ ఉక్కుకు వేలకోట్లు కేటాయిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం కాకుండా కాపాడారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉద్యోగులకు జీతాలు,పింఛన్లు సకాలంలో ఇస్తున్నారన్నారు. ఎన్డీఏ కూటమి పాలన ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. గత వైసిపి పాలనలో ఎస్సీ,ఎస్టీల సంక్షేమం, సబ్ ప్లాన్ నిధులు సైతం దారి మళ్లించారని విమర్శించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ విజ్ఞులైన పట్టభద్రులంతా తనను బలపరచాలని, మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ మాధుర్లను గెలిపించిన రీతిలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల తదితర సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు రవ్వ నాగభూషణం, కాటే సుబ్రమణ్యం, సిరా సురేష్, దూడల శంకర్నారాయణ, ఆకుమర్తి చిన్న తదితరులు మాట్లాడితూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పథకాలన్నీ గత జగన్ ప్రభుత్వం రద్దు చేయగా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ పథకాలన్నీ పునరుద్ధరించి అమలు చేస్తూ దళితుల పక్షాన నిలిచిందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఎన్నికల పరిశీలకులు కాకినాడ రామారావు, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, పెద్ద ఎత్తున పట్టబద్రులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబూ జగజ్జివన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.