Suryaa.co.in

Telangana

మోదీ రాజ ధర్మం లేదు..అంతా వివక్షే

– బీఆర్‌ఎస్‌ ఎక్కువ సీట్లు సాధించబోతోంది
-ఏపీలో జగన్‌కు మంచి ఫలితాలు
-కరెంట్‌ కోతలపై కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు
-మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో మాజీ మంత్రి కేటీఆర్‌ తన కుటుంబంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఇంతకంటే అనేక సవాళ్లతో కూడుకున్న ఎన్నికలలో విజయం సాధించామని, అప్పటి కన్నా సీట్లు ఎక్కువ సాధిస్తామన్న నమ్మకం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్‌ రెడ్డి నాకు సోదరుడి లాంటి వాడు. ఈ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారన్న నమ్మకం ఉందని వ్యాఖ్యా నించారు.

పోలింగ్‌ స్టేషన్లలో కరెంటు పోకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు అధికారులతో తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుంది. ఆరు గ్యారంటీలలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఒక గ్యారంటీని సగం సగం అమలు చేసింది. ఇప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అని గుర్తించుకోవాలి. కరెంటు కోతలు, నీటి కొరత, సమస్యలపై దృష్టిపెట్టాలి. నరేంద్ర మోడీ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పినట్టు రాజు ధర్మాన్ని పాటించాలి. అన్ని రాష్ట్రాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించడం లేదా ప్రాజెక్టులు కేటాయించడం చేయలేదు. భారతదేశం మొత్తం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పదేళ్లుగా మోదీ ప్రజలను మోసం చేస్తుంటే.. వందరోజుల నుంచి ఇక్కడ రేవంత్‌ రెడ్డి మోసం చేస్తున్నా రు.

ఈరోజు కరెంటు కోతలపై కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చినట్టుగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇన్వర్టర్లు, జనరేటర్లు, క్యాండిల్స్‌, పవర్‌ బ్యాంకులు, చార్జింగ్‌ లైట్‌, ఇవే కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలని ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్‌. తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశాను అని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE