Suryaa.co.in

Andhra Pradesh

ఇళ్లస్థలాలు ఇవ్వకుండా మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారు

-ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుంది
-చంద్రబాబు తన పాలనలో ఒక్క ఇంటి పట్టాకూడా ఇవ్వలేదు
-నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు
-అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్‌
-సీఆర్డీఏ పరిధిలో 50, 703 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ
-సీఎం జగన్‌

►ఈ కార్యక్రమానికి దేశ చరిత్రలో ప్రత్యేకత ఉంది:
►పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని వేల పోరాటాలు దేశంలో చాలా జరిగాయి
►కాని, ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయపోరాటం చేసి, సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ.. 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటన
►ఎక్కడైనా ఇలాంటివి చూస్తే… ఆశ్చర్యం కలుగుతోంది
►ఇళ్లస్థలాలు ఇవ్వకుండా మారీచులు, రాక్షసులు అడ్డుపడ్డారు
►ఈ ప్రాంతంలో గజం ధర రమారమి ఎంత అని అడిగాను
►ఈ మధ్యకాలంలో జరిగిన వేలంలో గజం ఇక్కడ రూ.17వేలకు అమ్ముడుపోయిందని చెప్పారు
►రూ.7-10 లక్షల ఇంటి స్థలం నా అక్క చెల్లెమ్మల పేర్లమీద రిజిస్ట్రేషన్‌ జరగబోతోంది
►ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది
►సామాజిక న్యాయ పత్రాలుగా.. ఈ ఇంటి పట్టాలు ఇస్తున్నాం
►ఇదే అమరావతి.. ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుంది
►ఈ అమరావతి ఇకపై మన అందరి అమరావతి అవుతుంది
►మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 1400 ఎకరాల్లో 50వేల మందికిపైగా నా పేద అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇస్తున్నాం:
►25 లే అవుట్లలో ఇంటి పట్టాలు ఇస్తున్నాం
►వారంరోజులపాటు ఈ పండుగ కార్యక్రమం జరుగుతోంది
►ప్రతి లే అవుట్‌ దగ్గరకు లబ్ధిదారులను తీసుకెళ్లి.. వారికిస్తున్న ఇంటి స్థలం చూపించి.. ఇంటి పట్టా ఇస్తాం
►అక్కడే ఫోటో తీసుకుని.. చిక్కటి చిరునువ్వులు వారి ముఖంలో చూసేలా కార్యక్రమం
జియో ట్యాగింగ్‌ తీసుకుని.. వారంరోజుల్లో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి:- ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం
►జులై 8న, వైయస్సార్‌ జయంతి రోజున ఇళ్ల స్థలాల్లో ఇల్లుమంజూరుచేసి.. ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలవుతుంది
►ఇప్పటికే ల్యాండ్‌ లెవలింగ్‌, సరిహద్దు రాళ్లను పాతడం, అంతర్గత రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యిది
►ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇస్తాం
►తము తాముగా కట్టుకుంటామంటే.. రూ.1.8లక్షలు బ్యాంకుల ఖాతాల్లో వేస్తాం
►రెండో ఆప్షన్‌గా వారికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్‌ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తాం. నిర్మాణకూలి వారి ఖాతాల్లోకి నేరుగా జమచేస్తాం
►ఆప్షన్‌ -3గా… ప్రభుత్వమే కట్టించాలని అడిగితే.. చిరునవ్వుతో స్వీకరించి.. ఆ ఇళ్లను ప్రభుత్వమే నిర్మించిన ఇస్తుంది
►ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్‌ తీసుకున్నా.. పర్వాలేదు
►ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇసుక పూర్తిగా అందజేయడం జరుగుతుంది
►సిమెంటు, స్టీల్‌, డోర్‌ ఫ్రేములు అన్నీ కూడా తక్కువ రేటుకే అందరికీ అందించడం జరుగుతుంది
►మార్కెట్లో రేట్లకన్నా.. తక్కువ రేట్లకు ప్రభుత్వం అందిస్తుంది
►నాణ్యత విషయలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడ్డంలేదు
►రూ.35వేలు చొప్పున రుణాలు లబ్ధిదారులకు బ్యాంకులనుంచి ఇప్పిస్తున్నాం. పావలావడ్డీకే ఈ రుణాలు ఇప్పిస్తున్నాం
►ఇల్లు పూర్తైన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఉంటుంది.
►రూ.2-3 లక్షల కోట్లు మీ అన్నగా, మీ బిడ్డగా.. అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నాను
►గతంలో ఇలాంటి ఆలోచనలు.. గత ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా?
►సీఆర్డీయే ప్రాంతంలో 5,024 మందికి పూర్తైన టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నాం
►300 చదరపు అడుగులు ఫ్లాటు కట్టడానికి అయ్యు విలువ దాదాపుగా రూ.5.75లక్షలు అవుతోంది. మౌలిక సదుపాయాలకోసం రూ.1 లక్ష అవుతుంది
►కేంద్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తే.. మిగిలిన డబ్బును బ్యాంకులనుంచి అప్పుగా తీసుకుని… 20 ఏళ్లపాటు ఆ లబ్ధిదారుడు కట్టుకుంటూ పోవాలి
►మొత్తంగా రూ.7.2లక్షలు చెల్లించాల్సి ఉంటుంది పేదవాడు
►మరి ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా
►చంద్రబాబు చెప్పినట్టు…. టిడ్కో ఇళ్లను పేదవాడికి ఇచ్చినట్టేనా?
►మరి మీ అన్న ఏంచేశాడు
►ఆ ఫ్లాటును పేదవాళ్లకు పూర్తిగా రూ.1కే అక్క చెల్లెమ్మల పేరుమీ రాసిచ్చాడు
►కాని చంద్రబాబు, వారి గజ దొంగల ముఠాకు, ఎల్లోమీడియా వక్రభాష్యాలు చెప్తూనే ఉంది
►చంద్రబాబు తన పాలనలో ఒక్క ఇంటి పట్టాకూడా ఇవ్వలేదు
►గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడు
►ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు
►సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడు
►వారికోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడు
►మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి
►నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు
►2014 -2019 వరకూ ఒక ఇళ్లపట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదు
►కోవిడ్‌ కష్టాలున్నా… రెండేళ్లు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా.. మీ బిడ్డ మాత్రం.. .మాకున్న కష్టంకన్నా.. మీ కష్టం ఎక్కువే అని భావించి మీ బిడ్డ పరిగెట్టాడు
►కోవిడ్‌ సమయంలో కూడా 30 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చాం
►ఆర్థికంగా ఎన్ని సవాళ్లైనా వచ్చినా సరే.. నవరత్నాల్లోని ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చాం
►ఇచ్చిన ప్రతీ వాగ్దానం కూడా అమలు చేశాం
►మేనిఫెస్టోలో 98శాతం వాగ్దానాలను అమలు చేశాం
►ఇళ్ల నిర్మాణాలను దశలవారీగా నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్నాం
►ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేదు
►మా అక్క చెల్ల్మెల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం
►చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వీరందరికీ, ఒక దత్తపుత్రుడు దోచుకున్నారు. వీరంతా గజ దొంగల ముఠా
►అప్పుల వృద్ధిరేటు చూస్తే… గత ప్రభుత్వం కన్నా.. తక్కవే
►మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు?
►వారికి మంచి చేసే ఉద్దేశం లేదు
►వారి దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి
►వారి దారుణాలను రాయరు, చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు
►ఇదీ చంద్రబాబు హయాంలో మాయ
►ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్‌ వార్‌
►ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు
►పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారు
►సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు
►జగన్‌ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తారు.. చూపుతారు
►పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం మనది
►ప్రతికాలనీలో అంగన్‌వాడీ, ప్రైమరీ స్కూల్‌, విలేజ్‌ క్లినిక్, డిజిటల్‌ లైబ్రరీ, పార్కులు కూడా రాబోతున్నాయి
►నవులూరిలోని లేక్‌ను కూడా అభివృద్ధిచేస్తున్నాం

మంత్రి జోగి రమేష్‌:
చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌.చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా పేదలే గెలిచారు. పేదల తరఫున పోరాటం చేసి విజయం సాధించాం.

మంత్రి మేరుగు నాగార్జున;
సామాజికి న్యాయానికి పండుగ రోజు.ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సువర్ణాధ్యాయం.రైతుల ముసుగులో చంద్రబాబు కుట్రలు పన్నారు.రైతులను నిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు.గతంలో ఇళ్ల పట్టాల కోసం వామపక్షాలు ధర్నాలు చేసేవి.ఇప్పుడు వామపక్షాలు ఎక్కడున్నాయి?
మంత్రి ఆదిమూలపు సురేష్‌:
50 వేల పట్టాలను అందించే శుభ ఘడియలు ఇవి.ఇళ్ల స్థలాలతో పాటు ఊళ్లే నిర్మిస్తున్న గొప్ప కార్యక్రమం.పేదల కోసం సీఎం జగన్‌ ఎంత దూరమైనా వెళతారు.పేదలంటే చంద్రబాబుకు పగ..పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్‌ సాకారం చేశారు.సీఎం జగన్‌ బలమైన సంకల్పం ముందు కుట్రలు పటాపంచలు. ఈ ఏడాది 2.63 లక్షల టిడ్కో ఇళ్లు అందిస్తాం.

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) :
పేదలంటే చంద్రబాబుకు చులకన.అమరావతిలో పేదలు ఉండకూడదని ఇళ్ల పట్టాలను చంద్రబాబు అడ్డుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు.ఇళ్ల పట్టాలతో అమరావతిలో పేదల కలను నిజం చేశారు సీఎం జగన్‌. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా నా పేదలే గెలిచారు.

వెంకటపాలెం చేరుకున్న సీఎం జగన్‌

►సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న సీఎం జగన్‌
►గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకట­పాలెంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద ‘నవ­రత్నా­లు–­పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలు అందజేత
►ఈ ప్రాంతంలో 1,402.58 ఎకరాల్లో ఆర్‌–5 జోన్‌ ఏర్పాటుచేసి 50,793 ప్లాట్లను సిద్ధంచేశారు.
►వీటితో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేస్తారు.
►ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వివిధ శాఖ అధికారులు, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు ఆహ్వానం.

రూ.2 వేల కోట్లతో కాలనీల నిర్మాణం
ఇక సీఆర్డీఏ పరిధిలో సిద్ధంచేసిన 25 లేఅవుట్లలో గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మంది, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 27,031 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్‌కు హద్దులు నిర్ణయిస్తూ 80 వేల హద్దు రాళ్లు ఏర్పాటుచేశారు. అంతర్గత రవాణా కోసం 95.16 కి.మీ పరిధిలో గ్రావెల్‌ రోడ్లు వేశారు.
లేఅవుట్లు, సభ ఏర్పాట్ల పరిశీలన
మరోవైపు.. లేఅవుట్లు, సభ ఏర్పాట్లను మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, విడదల రజిని, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, ప్రణాళికా బోర్డు వీసీ మల్లాది విష్ణు, పురపాలిక శాఖ ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ, సీఆర్డీయే కమిషనర్‌ వివేక్‌ యాదవ్, జిల్లా కలెక్టర్‌ ఎం వేణుగోపాల్‌రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ శ్రీలక్ష్మీ, జేసీ జీ. రాజకుమారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, ఆప్కో ఛైర్మన్‌ గంజి చిరంజీవి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు పరిశీలించారు.
టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ
నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్‌ నేడు పంపిణీ చేయనున్నారు.
♦️ రాష్ట్రవ్యాప్తంగా 1,43,000 మంది నిరుపేద లబ్ధిదారులకు 300 చ.అడుగుల టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో కేవలం రూ.1కే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. తద్వారా వారికి రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
♦️ ఇదే ఇంటికి గత టీడీపీ ప్రభుత్వం అసలు, వడ్డీతో కలిపి రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితిని కల్పించింది. ఆ భారం లేకుండా కేవలం రూ.1కే ఇప్పుడు ఇవ్వడం గమనార్హం.
♦️ దీంతోపాటు ఇతర టిడ్కో లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం రాయితీ కూడా ఇచ్చింది.
♦️ ఇక 365 చ.అ. లబ్ధిదారులు ఒకొక్కరికి రూ.25 వేల చొప్పున 44,304 మందికి, 430 చ.అ. లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున 74,312 మందికి మేలు చేసింది.
♦️ తద్వారా వారు చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భరించింది.
♦️ టిడ్కో ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయడం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ.60 వేల లబ్ధిచేకూరింది.
♦️ అలాగే, 2.62 లక్షల మంది టిడ్కో లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ.14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం మరో రూ.1,200 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.3,000 కోట్లు మొత్తం రూ.18,714 కోట్ల లబ్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చింది.
♦️ కానీ, గత టీడీపీ ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లలో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత జగన్‌ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను అందిస్తోంది.
♦️ ఇక ఈ ఇళ్ల పట్టాలు పంపిణీలో ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించవచ్చు.

LEAVE A RESPONSE